AUS vs SA Highlights: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో తమకు ఎదురులేదని ఆస్ట్రేలియా నిరూపించుకుంది. రికార్డుస్థాయిలో పొట్టి విశ్వకప్‌ను ఆరోసారి ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం సఫారీ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 రన్స్ మాత్రమే చేసింది. ఆసీసీ తరుఫున ఓపెనర్ బెత్ మూనీ (74 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. మహిళల టీ20 వరల్డ్‌ను గెలుచుకున్న కంగారూ జట్టుకు ట్రోఫీతోపాటు ప్రైజ్ మనీగా రూ. 8.27 కోట్లు అందించారు.
ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో ఆరోసారి కైవసం చేసుకుంది. ఇంతకుముందు 2010, 2012, 2014, 2018, 2020 ఆ జట్టు పొట్టి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారి కూడా టోర్నీ ఆరంభం నుంచి తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా.. అన్ని జట్లను అలవోకగా చిత్తుచేసింది. విన్నర్‌కు రూ.8.27 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ దక్షిణాఫ్రికా రూ.4.13 కోట్లు అందుకుంది. ఈ రెండు జట్లతో పాటు సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు రూ.1.73 కోట్లు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ మరోసారి ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ బెత్ మూనీ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగింది. 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 74 పరుగులు చేసింది. మిగిలిన బ్యాట్స్‌వుమెన్ తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున షబ్నమ్ ఇస్మాయిల్, మరిజన్ కాప్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం సఫారీ జట్టు 20 ఓవర్లలో 137 రన్స్ వద్ద ఆగిపోయింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ 61 (48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. బెత్ మూనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. గాడ్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
Also Read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్ విధానంలో కీలక మార్పులు..?
Also Read: Doctor Preethi Death: మృత్యువుకు తలవంచిన ప్రీతి.. విషాదంలో కుటుంబం, స్నేహితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి