SRH Vs CSK Live Updates: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య రసవత్తర మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత మాజీ ఆటగాడు అజహరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేడియం అధ్వానంగా ఉందని.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Uppal Stadium: హైదరాబాద్‌ Vs చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక పరిణామం.. ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్‌ బంద్‌


ఉప్పల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం జరుగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ సీఎస్కే మ్యాచ్‌పై హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ శుక్రవారం మధ్యాహ్నం స్పందించారు. 'హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎన్నో సమస్యలతో ముప్పుతిప్పలు పడుతున్నాయి. అధ్వాన మరుగుదొడ్లు, నీటి సమస్య వంటివి వేధిస్తున్నాయి. హెచ్‌సీఏ ఆధ్వర్యంలోనే అనధికారిక ప్రవేశాలు కొనసాగుతున్నాయి. విమర్శకులకు ఈ లోపాలు కనిపించడం లేదా? హెచ్‌సీఏ సభ్యులకు కూడా టికెట్లు దొరకడం లేదు. కానీ బ్లాక్‌ మార్కెట్‌ దొంగలకు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సంస్కరణలు చేస్తామని చెప్పి హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ గందరగోళాన్ని అందించింది. మార్పు ఎక్కడ ఉంది?' అని ప్రశ్నించారు. 

Also Read: GT vs PBKS Highlights: శుభ్‌మన్‌ గిల్‌ కుమ్మినా గుజరాత్‌కు తప్పని ఓటమి.. శశాంక్‌ మాయతో పంజాబ్‌ విజయం


హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లపై తీవ్ర వివాదం ఏర్పడుతుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌, చెన్నై మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌పై ఆసక్తి ఏర్పడడంతో మ్యాచ్‌ టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. సాధారణ ప్రేక్షకులకే కాకుండా వీఐపీలు, హెచ్‌సీఏ ప్రతినిధులకు కూడా లభించలేదు. దీంతో మరోసారి హెచ్‌సీఏ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. తాజాగా అజహరుద్దీన్‌ విమర్శలతో మరోసారి హెచ్‌సీఏపై తీవ్ర వివాదం మొదలైంది. ఇదే విషయమై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి