Sarah Taylor Child: మహిళా భాగస్వామితో.. బిడ్డను కననున్న మహిళా స్టార్ క్రికెటర్!
Sarah Taylor posted a picture with her partner. ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ తన భాగస్వామి డయానాతో కలిసి తల్లి కాబోతున్నారు.
England Cricketer Sarah Taylor announces pregnancy with partner Diana: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ తన భాగస్వామి డయానాతో కలిసి తల్లి కాబోతున్నారు. డయానా తల్లి కాబోతున్నట్లు ఈరోజు (ఫిబ్రవరి 22) సోషల్ మీడియా వేదికగా సారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ కిట్ చూపిస్తూ ఇద్దరి ఫొటోను ఇన్‌స్టాలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ షేర్ చేశారు. స్వలింగ సంపర్కురాలైన మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సారా టేలర్.. చాలా కాలంగా డయానా అనే మహిళతో సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం సారా టేలర్ పేరు వార్తల్లో నిలిచింది.
'తల్లి కావడం నా భాగస్వామి కల. ఈ ప్రయాణం అంత తేలికైనది కాదు. కానీ డయానా ఎప్పటికీ ఈ అవకాశాన్ని వదులుకోడానికి రాజీ పడలేదు. ఆమె ఉత్తమ తల్లి అవుతుందని నాకు తెలుసు. ఇందులో భాగమవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 19 వారాలు గడవాలి. నా జీవితం చాలా కొత్తగా ఉండబోతుంది. డయానా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నా' అని ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. అందరూ సారా టేలర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సారా టేలర్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున 10 టెస్ట్‌లు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడారు. టెస్ట్‌లో 300 పరుగులు, వన్డేల్లో 4056 పరుగులు, టీ20ల్లో 2177 పరుగులు చేశారు. వన్డేల్లో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేసిన సారా టేలర్.. టీ20ల్లో 16 అర్ధ శతకాలు చేశారు. వికెట్ కీపర్‌గా టెస్ట్‌ల్లో 18 క్యాచ్‌లు, 2 స్టంపౌట్‌లు.. వన్డేల్లో 87 క్యాచ్‌లు, 51 స్టంపౌట్‌లు.. టీ20ల్లో 23 క్యాచ్‌లు, 51 స్టంపౌట్‌లు చేశారు. 33 ఏళ్ల సారా 2017లో ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలు. టీ10 లీగ్‌లో అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎంపికైన తొలి మహిళా కోచ్‌గా సారా టేలర్ చరిత్ర సృష్టించారు.
ఇంగ్లండ్ బెస్ట్ కీపర్‌గా పేరొందని సారా టేలర్.. రెండు సార్లు 'ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్నారు. 2014లో 'ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా కూడా సెలక్ట్ అయ్యారు. కెరీర్‌లో ఎన్నో రికార్డులు అందుకున్న సారా.. 30 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని అశ్చర్యానికి గురి చేశారు. మానసిక ఆందోళన కారణంగా 2016లో విరామం తీసుకుని. మళ్లీ జట్టులోకి వచ్చినా ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.