ICC Rankings: 40 ఏళ్ల‌ వయసులోనూ తగ్గేదేలే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 బౌల‌ర్‌గా! కెరీర్‌లో ఆరోసారి

James Anderson Over Take Pat Cummins in ICC Test Rankings. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ తాజాగా విడుదల అయిన ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 22, 2023, 08:13 PM IST
  • 40 ఏళ్ల‌ వయసులోనూ తగ్గేదేలే
  • ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 బౌల‌ర్‌గా
  • కెరీర్‌లో ఆరోసారి
ICC Rankings: 40 ఏళ్ల‌ వయసులోనూ తగ్గేదేలే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 బౌల‌ర్‌గా! కెరీర్‌లో ఆరోసారి

James Anderson became No 1 Bowler in ICC Test Rankings: ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ తాజాగా విడుదల అయిన ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. న‌ల‌భై ఏళ్ల వ‌య‌సులో ఆండర్సన్‌ తన అద్భుత బౌలింగ్‌తో ఐసీసీ నంబ‌ర్ 1 టెస్టు బౌల‌ర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లను వెనక్కి నెట్టి నెం.1 ర్యాంక్‌లో నిలిచాడు. తాజాగా న్యూజిలాండ్‌తో మొద‌టి టెస్టులో ఆండర్సన్‌ ఏడు వికెట్లు ప‌డ‌గొట్టాడంతో నంబ‌ర్ వన్ టెస్టు బౌల‌ర్‌గా నిలిచాడు. 

నాలుగేళ్ల పాటు టెస్టు బౌలింగ్‌లో నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా ఉన్న ప్యాట్‌ కమిన్స్‌ (858 పాయింట్లు)ను జేమ్స్ అండర్సన్‌ వెనక్కి నెట్టాడు. జిమ్మీ ఖాతాలో ప్రస్తుతం 866 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కమిన్స్‌ రెండు స్థానాలు దిగజారి ప్రస్తుతం మూడో ర్యాంక్‌లో నిలిచాడు. అండర్సన్ తర్వాత భారత టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (864) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టులోనూ రాణిస్తే.. యాష్ టాప్‌ ర్యాంక్‌లో నిలిచే అవకాశం ఉంది. 

న‌ల‌భై ఏళ్లలో ప్రపంచ నంబ‌ర్ 1 అయిన రెండో బౌర‌ల్‌గా జేమ్స్ అండ‌ర్స‌న్ రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌల‌ర్ క్లారీ గ్రిమ్మెట్ 1936లో 40 ఏళ్ల‌కు టాప్ ర్యాంక్ అందుకున్నాడు. జిమ్మీ 2016లో మొద‌టిసారి నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ అయ్యాడు. స‌హ‌చ‌ర బౌలర్ స్టువార్ట్ బ్రాడ్‌ను వెనక్కి నెట్టి నంబ‌ర్ 1 ర్యాంకు అందుకున్నాడు. 2018లో ఐదు నెల‌లు నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా ఉన్నాడు. ఇంగ్లీష్ లెజెండ‌రీ బౌల‌ర్ నంబ‌ర్ 1 ర్యాంకు సాధించ‌డం ఇది ఆరోసారి కావడం విశేషం. 

స్వింగ్ కింగ్ అనే ట్యాగ్ ఉన్న జేమ్స్ అండ‌ర్స‌న్ గ‌త రెండు ద‌శాబ్దాల‌కు పైగా ఇంగ్లండ్ పేస్ ద‌ళానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇన్‌ స్వింగ్‌తో బ్యాట‌ర్ల‌ను బొల్తా కొట్టిస్తూ వికెట్ల మీద వికెట్స్ పడగొడుతున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా జిమ్మీ గుర్తింపు సాధించాడు. ప్ర‌స్తుతం జిమ్మీ ఖాతాలో 682 వికెట్లు ఉన్నాయి. శ్రీ‌లంక మాజీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. 

Also Read: King Cobra Poison Live Video: పాయిజన్ చిమ్ముతున్న కింగ్ కోబ్రా.. లైవ్ వీడియో చూసేయండి! జాగ్రత్త సుమీ

Also Read: Varasudu OTT Release Date: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వార‌సుడు.. సినిమా చూసి ఎంజాయ్ చేసేయండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News