Ashwin Yadav dies of heart attack: హైదరాబాద్: మాజీ పేస్ బౌలర్ అశ్విన్ యాదవ్ (33) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అశ్విన్ యాదవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టారు. చివరిగా 2009లో ముంబైతో రంజీ మ్యాచ్ ఆడిన అశ్విన్‌కి ఆ తర్వాత అవకాశం దక్కలేదు. 2008-9 సీజన్‌లో ఢీల్లీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. 2 టీ 20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ యాదవ్.. 2009 తర్వాత నుంచి అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరపున, ఆ తర్వాత ఎస్బీఐ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అశ్విన్ యాదవ్‌కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంత చిన్న వయస్సులోనే గుండెపోటుతో కన్నుమూయడం క్రీడావర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అశ్విన్ యాదవ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేసిన టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ (R Sridhar).. అశ్విన్ నైపుణ్యాలను, అతడి వ్యక్తిత్వాన్ని ఆ ట్వీట్‌లో కొనియాడారు. 


Also read : తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ Free COVID-19 vaccine: సీఎం కేసీఆర్


అశ్విన్ యాదవ్ టీమ్మేట్ ఆఫ్ స్పిన్నర్ విశాల్ శర్మ స్పందిస్తూ.. అశ్విన్ ఇంత చిన్న వయస్సులోనే ఇలా గుండెపోటుతో మనకు దూరమయ్యాడంటే  (Ashwin Yadav's death) ఇంకా నమ్మలేకపోతున్నానని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశాడు. అశ్విన్ టీమ్‌లో అందరితో కలిసిపోయేవాడు. అందరితో సరదాగా ఉండే వాడు అని అతడితో తనకు ఉన్న అనుబంధాన్ని విశాల్ శర్మ గుర్తుచేసుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook