Harbhajan All Time IPL X1: ఐపీఎల్‌ (IPL) ప్రారంభమై 15 వసంతాలు పూర్తి  చేసుకుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుతం ఆప్ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) కూడా తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనిని (MS Dhoni) ఎంచుకున్నాడు. తన జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించాడు భజ్జీ. ధోనితోపాటు రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజాలకు ప్లేస్ ఇచ్చాడు. వెస్టిండీస్‌ నుంచి ముగ్గురికి, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి చోటు కల్పించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే భజ్జీ ప్రకటించిన జట్టులో ఆసీస్ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు చోటు కల్పించకపోవడం చర్చనీయంశంగా మారింది. ఎందుకంటే ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో వార్నర్ (David Warner) ఒకడు. ఈ క్రమంలో అతడికి చోటు కల్పిస్తే బాగుండేదని వార్నర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 


Also read: Csk Ms Dhoni: ధోనీ ఖాతాలో అదురైన రికార్డు..ఏమిటది! 


తన ఆల్‌టైం ఐపీఎల్ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మలను భజ్జీ ఎంచుకున్నాడు. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి, నాలుగు, ఐదు స్థానాల కోసం షేన్‌ వాట్సన్‌, ఏబీ డివిలియర్స్‌లను ఎంచుకున్నాడు. ఆరో స్థానం కోసం ధోనిని ఎంపిక చేసిన భజ్జీ.. ఆల్‌రౌండర్ల కోటాలో కీరన్‌ పోలార్డ్‌, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించాడు. ఇక స్పిన్నర్ కోటా కింద సునీల్ నరైన్ కు అవకాశం ఇచ్చాడు. నరైన్‌ బ్యాటింగ్ లో కూడా రాణించడం భజ్జీ ఎంపికకు కారణం కావచ్చు. పేసర్లుగా లసింత మలింగ, జస్ప్రీత్‌ బుమ్రాలను ఎంచుకున్నాడు.


హర్భజన్ సింగ్ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, షేన్ వాట్సన్, ఏబీ డివిల్లియర్స్, ఎంఎస్‌ ధోని (కెప్టెన్), రవీంద్ర జడేజా, కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook