భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్, సిరీస్ అంటే చాలు ప్రపంచ దేశాల చూపుంతా దీనిమీదే ఉంటుంది. దాయాది దేశం పాక్ ఆటగాళ్లు మరింత దురుసుగా ప్రవర్తించి, టీమిండియా ఆటగాళ్లపై మాటల దాడికి దిగేవారు. భారత ఆటగాళ్లను కవ్విస్తూ వారి వికెట్ తీయాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. ముఖ్యంగా పాక్ స్పీడ్‌స్టర్, రావల్ఫిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ బౌలింగ్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2007లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా తనను పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ భయపెట్టాడని, తనకు వార్నింగ్ ఇచ్చాడని టీమిండియా బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప వెల్లడించాడు. యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ దాదాపు 14 ఏళ్ల తరువాత పాత రోజుల్ని నెమరువేసుకున్నాడు. పాక్, టీమిండియా(Team India) ఆటగాళ్లు కలిసి డిన్నర్ చేస్తున్న సందర్భంగా జరిగిన ఓ సంఘటనను ఉతప్ప వివరించాడు. ‘నువ్వు ఫస్ట్ వన్డేలో చాలా బాగా ఆడావు. అయితే నా బౌలింగ్‌లో నువ్వు క్రీజు వదిలి ముందుకొచ్చి షాట్లు ఆడుతున్నావు. ఇంకోసారి నువ్వు అలా చేశావంటే నేను కచ్చితంగా నీ తలకు బీమర్ విసురుతా జాగ్రత్తగా ఉండూ అంటూ’ షోయబ్ అక్తర్ తనను హెచ్చరించినట్లు ఉతప్ప ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు.


Also Read: IPL 2021 మధ్యలో నిలిచిపోవడానికి వారిదే తప్పిదమా, ఆసక్తికర విషయాలు


అక్తర్ అలా అనేసరికి తాను మరోసారి క్రీజు వదిలి వచ్చి ఈ పేసర్ బౌలింగ్‌ను ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. గువాహటిలో జరిగిన వన్డేలో త్వరగా చీకటి పడుతుంది. మ్యాచ్‌లో రెండు కొత్త బంతులు అప్పట్లో లేదు. వన్డేలో 25 బంతుల్లో 12 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. ఆ సమయంలో పాకిస్తాన్ (Pakistan) పేసర్ అక్తర్ యార్కర్ సంధించగా ఆడలేకపోయాను. మరో బంతిని గంటకు 154 కి.మీ వేగంతో సంధించాడు. 


మరుసటి బంతి లో ఫుల్‌టాస్ వేయగా ఉతప్ప బౌండరీకి తరలించాడు. మరోసారి అవకాశం వస్తుందో లేదోనని క్రీజు వదిలి ముందుకొచ్చి అక్తర్ వేసిన బాల్‌ను ఫోర్ కొట్టాను. దాంతో మేం విజయం సాధించామని అక్తర్‌ తనకు వార్నింగ్ ఇచ్చిన సంఘనను రాబిన్ ఉతప్ప తెలిపాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో పాక్‌పై భారత్ కైవసం చేసుకుందని తెలిసిందే. అయితే పలు సందర్భాలలో అక్తర్ సహా పాక్ ఆటగాళ్లు భారత క్రికెటర్లను కవ్విస్తూ మాటల దాడికి దిగేవారు.


Also Read: Bhuvneshwar Kumarకు టెస్ట్ క్రికెట్ బోర్ కొట్టిందా, ఘాటుగా స్పందించిన Team India పేసర్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook