Kamal Morarka Passes Away | న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మోరార్కా (74) కన్నుమూశారు. గతకొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోరార్కా శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస (Kamal Morarka Passes Away) విడిచారు. రాజ్యసభ మాజీ సభ్యుడైన కమల్ మోరార్కా 1990-91  కాలంలో చంద్రశేఖర్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1988-94లో మోరార్కా రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా జనతాదళ్ (సెక్యులర్) పార్టీ నుంచి ఎన్నికయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1946 జూన్ 18వతేదీన మార్వాడీ కుటుంబంలో జన్మించిన కమల్ మోరార్కా (Kamal Morarka) పారిశ్రామికవేత్తగా మోరార్కా ఆర్గానిక్ కంపెనీ ఛైర్మన్‌గా వ్యవహరించడంతోపాటు రాజకీయాల్లో రాణించారు. 2012 నుంచి సమాజ్ వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) కి నాయకత్వం సైతం వహించారు. కమల్ మోరార్క క్రీడల పట్ల మక్కువతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ  (BCCI) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. Also Read: COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ


సేంద్రీయ సేద్యం చేసిన కమల్ సోషల్ వర్కర్‌గా ఎంఆర్ మోరార్కా ఫౌండేషన్‌ను నెలకొల్పి షేకావతి ఫెస్టివల్ సైతం నిర్వహించారు. అంతేకాకుండా పలు పుస్తకాలను సైతం రచించారు. పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి  కమల్ మృతి తీరని లోటని రాజస్థాన్ ( Rajasthan) మాజీ మంత్రి, నవల్‌గఢ్‌ ఎమ్మెల్యే రాజ్ కుమార్ శర్మ సంతాపం తెలిపారు. 


Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook