కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) యూఏఈ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 5 నెలల తర్వాత ప్రత్యర్థి జట్లతో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఓ విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 19కి ముందే.. అంటే ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందే వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. COVID19 Tests: ఐపీఎల్ ఆటగాళ్ల కోవిడ్ టెస్టులకు భారీగా ఖర్చు 
Mahesh Babu: పవన్ కల్యాణ్‌కు మహేష్ బాబు స్పెషల్ విషెస్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనీసం అప్పుడైనా కొంతమేర తమకు తగిన ప్రాక్టీస్ దొరుకుతుందని ఆటగాళ్లు భావిస్తున్నారని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. అసలే కరోనా వాతావరణంతో ప్రాక్టీస్ కూడా చేయడం కొన్ని జట్లకు వీలు పడటం లేదని, ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు అసలైన ప్రాక్టీస్‌తో పాటు వీక్షకులకు వినోదాన్ని పంచుదామని బ్రాడ్ కాస్టర్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం


కాగా, మరో రెండు రోజుల్లో వార్మప్ మ్యాచ్‌లపై  బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అసలే ఆటగాళ్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయాలతో పాటు ఐపీఎల్ సజావుగా జరుగుతుందా అనే కోణంలోనూ బీసీసీఐ ఆలోచిస్తుంటే మధ్యలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల భారాన్ని మోస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’ 
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక