నిజం చెప్పండి.. లేదంటే అబద్దం అని తేలితే రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. బీసీసీఐతో ( BCCI ) ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లకు బోర్డు ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇదేం వార్నింగ్.. అంత పెద్ద నేరం వాళ్లేం చేశారనే కదా మీ డౌట్!!. మరేం లేదండి.. బీసీసీఐతో ఒప్పందం కుదర్చుకోవడం కోసం కొంత మంది ఆటగాళ్లు తమ అసలు వయస్సు వివరాలను దాచిపెట్టి, ఫేక్ డాక్యుమెంట్స్‌తో ( Fake documents ) తప్పుడు వివరాలు సమర్పిస్తుంటారని.. అటువంటి వారికి వాల్యుంటరీ డిస్‌క్లోజ్ స్కీమ్ ( Voluntary Disclosure Scheme ) కింద స్వచ్ఛందంగా వారే తమ తప్పు ఒప్పుకునేందుకు ఓ అవకాశం ఇస్తున్నట్టు బీసీసీఐ స్పష్టంచేసింది. Also read: అర్ధరాత్రి ప్యాంట్‌లో ఏదో కదులుతోందని చూసి షాకయ్యాడు.. వైరల్ వీడియో


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లు అలా తమ అసలు వయసును దాచి బిసిసిఐని మోసం చేసి ( Age fraud ) ఉన్నట్టయితే.. వారు ఇప్పుడు నిజం ఒప్పుకుంటే పర్వాలేదు. నిజాన్ని అంగీకరిస్తూ అసలు వయస్సును ధృవీకరించే వివరాలతో ఓ లేఖను సమర్పించిన వారికి.. వారి వయస్సుకు తగిన గ్రూప్ మ్యాచుల్లో ఆడుకునేందుకు బీసీసీఐ అనుమతిస్తుంది. అలా కాకుండా ఆటగాళ్లు నిజం ఒప్పుకోకుండా.. ఆ తర్వాత బీసీసీఐ పరిశోధనలో అసలు నిజం తేలితే.. ఆ తర్వాత వారు రెండేళ్లపాటు బ్యాట్, బంతి పట్టుకోకుండా వీల్లేకుండా నిషేధం విధిస్తామని బిసిసిఐ హెచ్చరించింది. Also read: Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?


బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid ) స్పందిస్తూ.. సెప్టేంబర్ 15వ తేదీ వరకు డెడ్ లైన్ విధిస్తూ బీసీసీఐతో పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లు అందరికీ బిసిసిఐ ఈ అవకాశం కల్పించిందని.. తప్పు చేసిన వారికి ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఇదో చక్కటి అవకాశం అని అభిప్రాయపడ్డాడు. Also read: ప్యూన్ ఉద్యోగం కోసం అంతర్జాతీయ మాజీ క్రికెటర్ దరఖాస్తు