అతడు ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్ మాత్రమే కాదు... జాతీయ జట్టుకు కెప్టేన్ కూడా.. ఒకటి కాదు.. రెండు కాదు.. 2011 - 2019 మధ్య తొమ్మిదేళ్ల పాటు ఏకంగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ( International cricket) ఆడాడు. కానీ సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఓ ప్యూన్ ఉద్యోగం ( Peon Job ) కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అదేంటి.. రంజి క్రికెట్ ఆడినా చాలు హాయిగా జీవితాన్ని గడిపేస్తున్న క్రికెటర్స్ ఉన్న ఈ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడి కూడా అతడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఐతే, ఆ క్రికెటర్ ఎవరో, అతడికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో, అతడి ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాల్సిందే. Also read: Unlock 3.0 guidelines: అన్‌లాక్ 3.0లో అందుబాటులో ఉండేవి.. లేనివి జాబితా
Dinesh Sain.. హర్యానాలోని సోనేపట్కి చెందిన దినేష్ సెయిన్ అంటే స్టార్ క్రికెటర్ల స్థాయిలో కాకున్నా.. అంతగా పరిచయం అక్కర్లేని పేరు మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే.. పుట్టుకతోనే పోలియో బారిన పడిన దినేష్... క్రికెట్‌పై మక్కువతో క్రికెట్ ఆడుతూ ఆడుతూ జాతీయ దివ్యాంగుల జట్టులో స్థానం సంపాదించుకోవడమే కాకుండా కొన్ని మ్యాచ్‌లకు సారధ్యం కూడా వహించాడు. Also read: Suresh Raina: ధోనీ తర్వాత మళ్లీ తనే.. రోహిత్ శర్మపై రైనా ప్రశంసలు
మిగతా స్టార్ క్రికెటర్లకు ఆఫర్స్ ఇచ్చినట్టు కార్పొరేట్ కంపెనీలు అతడికి తమ బ్రాండ్స్ ఎండార్స్ ( Brand endorsements) చేసే అవకాశాలు ఇవ్వలేదు. మ్యాచ్ ఫీజులతో వచ్చే మొత్తం కూడా అంతగా ఉండకపోవడంతో దినేష్ వెనకేసుకుంది కూడా ఏమీ లేదు. దీంతో భార్య, ఏడాది వయస్సున్న కొడుకుతో సంసారం లాగడం భారంగా మారిన నేపథ్యంలో ప్యూన్ ఉద్యోగమైనా పర్వాలేదు అంటూ ఢిల్లీలోని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ కార్యాలయంలో ప్యూన్ ఉద్యోగానికే ( Peon job in NADA office) దరఖాస్తు చేసుకున్నాడు. పత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న దినేష్ సెయిన్.. గతంలో సోనేపట్ జిల్లా కోర్టులో రెండుసార్లు ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా తనని సెలెక్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. Also read: IPL 2020: షమీ ఫామ్ హౌజ్‌లో సర్ఫరాజ్ ప్రాక్టీస్
ఐటిఐలో డిప్లొమా చేసిన దినేష్ కార్తిక్ గతంలో ఓ పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటికీ.. అక్కడ కూడా నిరాశే ఎదురైందని చెప్పిన తీరు ఎవరికైనా కన్నీళ్లు తెప్పించకమానదు. దినేష్ లాంటి దివ్యాంగ క్రికెటర్ల ఆర్థిక ఇబ్బందులపై ఆలిండియా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ (AICAPC) అధ్యక్షుడు, టీమిండియా మాజీ పేసర్ కర్సన్ గవ్రి మాట్లాడుతూ.. దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. Also read: Smoking vs COVID-19: సిగరెట్ తాగే అలవాటుందా ? ఐతే కరోనాతో కష్టమే!