Gautam Gambhir Corona: గౌతమ్ గంభీర్‌కు కరోనా.. ట్విట్టర్ వేదికగా వెల్లడి
Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్‌కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గంభీర్ ట్వీట్ చేశాడు.
Gautam Gambhir Corona Positive: దేశంలో కరోనా (Covid-19) ఉద్ధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
''నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. నాతో పరిచయం ఉన్న వ్యక్తులందరూ, కోవిడ్ టెస్ట్ చేసుకుని సురక్షితంగా ఉండండి’'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
Also Read: Viral Video: తగ్గేదేలే అంటోన్న క్రికెటర్లు... పుష్పరాజ్ మేనరిజంతో అలరించిన బంగ్లాదేశ్ క్రికెటర్
గౌతమ్ గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. గంభీర్ భారత్ తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007, 2011 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, KKR 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు (Lucknow Super Giants) మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook