Greatest Catch Ever: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని క్యాచ్.. చూస్తే బిత్తరపోవాల్సిందే (వీడియో)!
Greatest dropped Catch Ever. విలేజ్ లీగ్ గేమ్‌లో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని క్యాచ్ పట్టాడు. వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Aldwick Cricket Club bowler Alex Ryder tooks stunning catch: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని.. అందరిని ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకుంటారు. ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించి క్యాచ్ నమోదైంది. విలేజ్ లీగ్ గేమ్‌లో ఓ ప్లేయర్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని క్యాచ్ పట్టాడు.
విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా ఆల్డ్‌విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ చేస్తుండగా.. 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్‌కు దిగాడు. అలెక్స్ వేసిన బంతిని బ్యాటర్ భారీ షాట్ ఆడగా.. బాల్ అక్కడే గాల్లోకి లేచింది. దీంతో అతడు క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే క్యాచ్ అందుకున్న అలెక్స్ చేతి నుంచి బంతి ఒక్కసారిగా జారిపోయింది. ఇక్కడే ఎవరు ఊహించని ఓ ట్విస్ట్ జరిగింది.
క్యాచ్ అందుకునే క్రమంలో కింద పడిపోయిన అలెక్స్ రైడర్.. తన కాలును పైకి లేపాడు. అదే సమయంలో అతడి చేతిలోంచి జారిపోయిన బంతి కాలు మీద పడి మళ్లీ గాల్లోకి లేచింది. వెంటనే అప్రమత్తమైన అలెక్స్.. రెండో ప్రయత్నంలో క్యాచ్ అందుకున్నాడు. రైడర్ క్యాచ్ అందుకోగానే తోటి ఆటగాళ్లు నోరెళ్లబెట్టి సంబరాలు చేసుకున్నారు. అలెక్స్ ఊహించని క్యాచ్ అందుకోవడంతో బ్యాటర్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
అలెక్స్ రైడర్ అందుకున్న క్యాచుకు సంబంధించిన వీడియోను స్టంప్ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోనూ ఆల్డ్‌విక్ క్రికెట్ క్లబ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన ఫాన్స్.. ''గ్రేటెస్ట్ క్యాచ్ డ్రాప్ ఎవెర్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని క్యాచ్', 'టేక్ ఏ బో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసి ఎంజాయ్ చేశారుగా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook