Gujarat Titans likely to go IPL 2022 Final vs Rajasthan Royals, Netizens trolls on Kolkata Weather Update: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్లే ఆఫ్స్‌కు సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది సేపట్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7.30కు మ్యాచ్ మొదలవనుంది. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ క్వాలిఫయర్ 1‌‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కి చేరుతుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్‌కి వెళ్లాలంటే క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది. అందుకే క్వాలిఫయర్ 1‌‌ మ్యాచులోనే గెలిచి ఫైనల్ వెళ్లాలని ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే రాజస్తాన్‌ జట్టుతో పాటు క్రికెట్ అభిమానులను వరణుడు టెన్షన్ పెడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కురిసింది. ఈ విషయాన్ని స్వయంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. రాజస్థాన్ ప్లేయర్లు బస చేసిన హోటల్ కిటికీల నుంచి వర్షం కురుస్తున్న వీడియోను తీసి పోస్టు చేసింది. 'కోల్‌కతాలో వర్షం' అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియో చూస్తే కోల్‌కతాలో భారీ వర్షం కురిసినట్టు తెలుస్తోంది. అలానే ఆకాశం మొత్తం దట్టమైన మేఘాలు కమ్ముకుంది. వర్షం కూడా కురుస్తోంది. రోడ్డంతా జలమయమైంది.


ఓ వెబ్‌సైట్ ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందట. సాయంత్రం వరణుడు కరుణించే అవకాశాలు ఉన్నాయట. అయితే రాత్రి 8 గంటలకు ఉరుములతో కూడిన భారి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇప్పటికే కురిసిన వర్షంతో ఈడెన్ గార్డెన్స్ మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని తెలుస్తోంది. ఈ లోగా మరోసారి వర్షం పడితే.. మ్యాచ్ జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ నిర్ణీత సమయంలో ఆట సాధ్యం కాకపోతే, 5 ఓవర్ల ఆట కూడా జరగకపోతే.. 'సూపర్ ఓవర్' రెండు జట్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. 


గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ 1కు రిజర్వ్ డే ఉండదన్న విషయం తెలిసిందే. ఒకవేళ 'సూపర్ ఓవర్' కూడా సాధ్యం కాని సందర్భంలో లీగ్ దశలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉంటుందో ఆ టీమ్ విజేతగా నిలిచి నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఇదే జరిగితే గుజరాత్‌ ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే.. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన గుజరాత్‌ ఏకంగా 10 మ్యాచులు గెలిచి 20 పాయింట్స్ ఖాతాలో వేసుకుని పట్టికలో అగ్రస్థానంలో ఉంది కాబట్టి. మరోవైపు 14 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 9 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. వాతావరణ అప్ డేట్ తెలుసుకుంటున్న నెటిజన్లు.. 'రాజస్థాన్ రాయల్స్‌కు నిరాశే', 'ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌' అని కామెంట్స్ పెడుతున్నారు. 


Also Read: డుప్లెసిస్ ఆర్‌సీబీ తలరాతను మార్చాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సెహ్వాగ్‌


Also Read: AB de Villiers IPL: ఆర్‌సీబీ అభిమానులకు శుభవార్త.. ఏబీ డివిలియర్స్ వచ్చేస్తున్నాడు! అసలు ట్విస్ట్ ఏంటంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook