Gujarath Titans Acting Captain Rashid Khan Spectacular Innings Changed the Result With CSK:  ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌‌కింగ్స్ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠత రేపింది. రషీద్ ఖాన్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లు ఓ ఎత్తైతే..నిన్న అంటే ఆదివారం జరిగిన మ్యాచ్ మరో ఎత్తు. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్. చివరి వరకూ ఓడిపోతామనుకున్న మ్యాచ్. చెన్నై సూపర్‌కింగ్స్ రెండవ విజయాన్ని నమోదు చేయాల్సిన మ్యాచ్. ఓ వైపు డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో ఆడినట్టు ఆడుతూ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లినా..మ్యాచ్ గెలిచే పరిస్థితుల్లేవు గుజరాత్‌కు. 


టాస్ ఓడి  తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆరంభంలోనే వికెట్ల పతనం ప్రారంభమైంది. సీఎస్కే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ టైటాన్స్ విజయం గగనమైంది. డేవిడ్ మిల్లర్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు. డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో ఆడినట్టు ఆడాడు. 51 బంతుల్లో 94 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాడు.


అయినా..చివర్లో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటివరకూ నిదానంగా ఆడుతూ వచ్చిన రషీద్ ఖాన్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టుగా రెచ్చిపోయాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్ని రెండు సిక్సర్లు, ఒక ఫోర్, మరో సిక్సర్‌గా మలిచి 22 పరుగులు రాబట్టాడు. మొత్తానికి ఆ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. ఇక ఆ తరువాత బ్రేవో వేసిన 19 వ ఓవర్‌లో మరో బౌండరీ సాధించాడు. అలా 21 బంతుల్లో 40 పరుగులు చేసిన తరువాత అదే బ్రేవో బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మ్యాచ్ ఫలితాన్ని సమూలంగా మార్చేశాడు.


డేవిడ్ మిల్లర్ ఒంటిచేత్తో ఆడినట్టు ఆడటం, రషీద్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఓటమి చెందాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అటు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను కోల్పోయింది. అప్పటి వరకూ పట్టు సాధించిన సీఎస్కే బౌలర్లు చివర్లో పట్టు కోల్పోయారు. హార్ధిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో..వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ కెప్టెన్సీ వహించిన మ్యాచ్ ఇది. 


Also read: CSK vs GT: చివరి వరకూ ఉత్కంఠం..సీఎస్కేపై గుజరాత్ టైటాన్స్ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook