టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ( Hardik Pandya ) పుట్టిన రోజు నేడు. పాండ్య ఎంత మంచి బౌలరో.. అంతకన్నా చక్కగా బ్యాటింగ్ చేస్తాడు. అంతకు మించిన ఫీల్డర్ కూడా. వీటన్నింటిని మంచిన చిలిపితనం కూడా ఉంది అతనిలో. అందుకే అతని ఫ్యాన్స్ అంతా కుంగ్ ఫూ పాండ్య  ( Kung Fu Pandya ) అని కూడా పిలుస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


RGV : ఒబామా, ట్రంప్ మధ్య తేడాలేంటో చెప్పే ఆర్జీవి వీడియో


ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే హార్ధిక్ పాండ్య పుట్టిన రోజు కావడంతో ఇవాళ సోషల్ మీడియాలో ( Social Media ) పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు. అదే సమయంలో కొంత మంది పాండ్య పాత వీడియోల క్లిప్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఒక వీడియోను మీరు ఇప్పుడు చూడబోతున్నారు.


ఈ వీడియో కాస్త పాతది. ఇందులో పాండ్య ఫీల్డ్ బయట ఏదో తింటుంటాడు. అంతలోనే సన్ రైజర్స్ టీమ్ ప్లేయర్ అక్కడి నుంచి వెళ్తోండగా.. తింటావా బాస్ అని ఆఫర్ చేస్తాడు. అతను రెస్పాండ్ అవకపోవడంతో సరేలే నువ్వు తినకపోతే నేను తింటా అని తినేస్తాడు. కొన్ని సెకన్లపాటు ఉండే ఈ వీడియో చాలా సరదాగా ఉంటుంది.  



Also Read: HBD Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు


మీరు కూడా చూడండి: