Happy Birthday Virender Sehwag | క్రికెట్ (Cricket ) చరిత్రలో అత్యంత విధ్వంకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే చాలా మంది చెప్పే కామన్ పేరు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). చాలా మంది సెహ్వాగ్ బ్యాటింగ్ కోసమే మ్యాచ్ చూసేవాళ్లు. ఇందులో విదేశీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఔట్ అవుతామనే భయం లేదు.. సెంచరీ మిస్ అవుతామనే జంకులేదు. నచ్చినట్టు బ్యాటింగ్ చేయడం.. క్రికెట్ గేమ్ ఎంజాయ్ చేయడం ఇదే వీరు ప్రత్యేకత.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



తొలి బంతిలో భారీ షాట్..
టీమ్ ఇండియాకు ( Team India ) సెహ్వాగ్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడు. ఇలా సెహ్వాగ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన చాలా మ్యాచుల్లో స్కోర్ 4-0-0.1 తో ప్రారంభం అయ్యేది. అంటే తొలి బంతిలో ఫోర్ అన్నమాట. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచు మినహాయించి మిగితా మ్యాచుల్లో సెహ్వాగ్ తొలి బంతికే ఫోర్ లేదా సిక్సు కొట్టి ప్రారంభించాడు.


99,199,299 వద్ద భారీ షాట్
ఇంకో రన్ కొడితే సెంచురీ పూర్తి అవుతుంది అన్నప్పుడు చాలా మంది బ్యాట్స్‌మెన్ సింగల్ కోసం ప్రయత్నిస్తారు. రిస్క్ చేయరు. కానీ వీరు మాత్రం "వస్తే రాజ్యం.. పోతే సైనికుడు" అన్నట్టుగా రిస్కు చేసి మరీ సిక్సులు కొట్టేవాడు. అలా ఎన్నో సార్లు సెంచరీలు బాదిన వీరు...299 పరుగులపై కూడా అదే ఫీట్ చేసి డేర్ డెవిల్ అనిపించుకున్నాడు. త్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాట్స్ మెన్ ( First Indian Batsman to Score 300 ) అయ్యాడు.




90 రన్స్ వద్ద దూకుడు...
90 రన్స్ నుంచి సెంచరీ మధ్య చాలా మంది బ్యాట్స్‌మెన్ కాస్త ఖంగారు పడతారు. దీన్నే నెర్వెస్ నైంటీస్ ( Nervous Nineties ) అంటారు. మెల్లిగా ఒక్కో పరుగు జోడిస్తూ సెంచురీ చేస్తారు. కానీ వీరూ మాత్రం అలా కాదు. తొలి బంతి నుంచి చివరి బంతి వరకు దూకుడు మాత్రం అలాగే కొనసాగించేవాడు.


టెస్టు- టీ 20 రెండూ ఒకటే
టెస్టు మ్యాచు అంటే ప్రశాంతంగా ఆడాలి. టీ 20 విజిల్స్ పడేలా ఆడాలి. కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీ20 అయినా టెస్టు అయినా ఒకే తీరుగా ఆడేవాడు. దీంతో మ్యాచు చూసే ప్రేక్షకులకు ఇది టెస్టా లేదా టీ 20 మ్యాచా అని డౌట్ వచ్చేది.




అప్పర్ కట్..
ధోనీ ( MS Dhoni ) హెలికాప్టర్ షాట్ కన్నా ముందే సెహ్వాగ్ అప్పర్ కట్ బాగా పాపులర్. కష్టపడి బౌలర్ బౌన్సర్లు వేస్తే...జస్ట్ సింపుగ్ లా బ్యాట్ లేపి..బౌల్ నువ్వు కాస్తా బౌండరీ లైన్ దాటమ్మా అనేలా సిక్సులు కొట్టేవాడు సెహ్వాగ్. ఇలా బౌలర్లకు ఏ విధంగా మనశ్శాంతి లేకుండా గ్రౌండ్ లో వీరబాదుడు బాదేవాడు సెహ్వాగ్.




A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR