Harbhajan Singh Birthday: హర్భజన్ సింగ్.. హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్
1998లో అంతర్జాతీయ క్రికెట్ ( International Cricket) లో ప్రవేశించిన భజ్జీ… 2001లో టెస్టుల్లో తొలి హ్యట్రిక్ సాధించిన భారతీయ బౌలర్‌గా ఘనత సాధించాడు.
హర్బజన్ సింగ్‌ను ( Harbhajan Singh ) చాలా మంది టర్బోనేటర్ అంటారు. మరి కొంత మంది ముద్దుగా భజ్జీ ( Bhajji ) అని పిలుస్తుంటారు. అయితే క్రికెట్ చరిత్రలో మాత్రం అతను టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా ( First Indian Bowler To Take Hat Trick ) ఎప్పుడూ గుర్తుంటాడు. నేడు హర్భజన్ పుట్టిన రోజు సందర్భంగా అతడు 2001లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన వీడియో మరోసారి ట్రెండ్ అవుతోంది. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లో ( International Cricket) ప్రవేశించిన భజ్జీ… ఇండియన్ క్రికెట్ హిస్టరీలో టెస్టుల్లో హ్యట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా ఘనత సాధించాడు. Also Read : '12 O' CLOCK' టైటిల్ తో ఆర్జీవీ మరో హర్రర్ చిత్రం..
హర్భజన్ సింగ్ పుట్టిన రోజు ( Harbhajan Turbonator Birthday ) సందర్భంగా ప్రముఖ క్రికెటర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. భజ్జీకి సచిన్ పంజాబీలో ట్వీట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
సచిన్‌తో పాటు భువనేశ్వర్ కుమార్ ( Bhuvaneshwar Kumar ) , వీవీఎస్ లక్ష్మణ్ ( VVS Laxman ) కూడా భజ్జీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే సెటైరికల్‌గా ట్వీట్స్ చేసే వీరెంద్ర సెహ్వాగ్.. భజ్జీ బర్త్‌డే విషయంలోనూ తన స్టైల్‌ని చాటుకున్నాడు. అసర్దార్ సర్దార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సేహ్వాగ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. Also Read : DGCA International Flights: అంతర్జాతీయ విమానాలు జులై 31 వరకు రద్దు
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..