Hardik Pandya: ఐపీఎల్ 2024 వేలానికి ముందే కొంతమంది ఆటగాళ్ల మార్పిడి జరిగిపోతోంది. తొలి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించి, రెండవ ప్రయత్నంలో ఫైనల్ వరకూ చేర్చిన సారధిని ఏ టీమ్ అయినా వదులుకుంటుందా..అయినా హార్దిక్ పాండ్యా ఎందుకు ఫ్రాంచైజీ మారుతున్నాడనేది ఆశ్చర్యం కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్దిక్ పాండ్యా. టీమ్ ఇండియాలో బెస్ట్ ఆల్ రౌండర్. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శనతోనే టీమ్ ఇండియాలో చోటు సంపాదించి వైస్ కెప్టెన్‌గా, కెప్టెన్‌గా కూడా ఎదిగాడు. ఇటీవల ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల తరువాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు 2015లో కేవలం 10 లక్షలకు విక్రయమైన హార్దిక్ పాండ్యా ప్రయాణం..2022లో కొత్తగా ఫ్రాంచైజీగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ 15 కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్ బాధ్యతలు అప్పగించేంతవరకూ వెళ్లింది.


అంతేకాకుండా తొలి ప్రయత్నంలోనే జట్టుకు టైటిల్ అందించాడు. ఆ తరువాత 2023 లో ఫైనల్ వరకూ చేర్చాడు. వరుస రెండు సీజన్లలో జట్టును అగ్రస్థానంలో నిలపడమే కాకుండా 833 పరుగులతో 11 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అంతకుమించి గుజరాత్ టైటాన్స్ జట్టుకు స్థానికుడు కూడా. ఇన్ని సానుకూలాంశాలు కలిగిన ఆటగాడిని ఏ జట్టూ వదులుకోదు. అయినా హార్దిక్ పాండ్యా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టును వదిలి ముంబై ఇండియన్స్ జట్టుకు చేరడం దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రకటన విడుదల ఒక్కటే తక్కువ. ఇంట్రా ట్రేడింగ్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. 


ఆర్ధిక లావాదేవీలే కారణం


ఐపీఎల్ అంటేనే హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్. ఆర్ధిక లావాదేవీలే హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టును వదలడానికి కారణంగా తెలుస్తోంది. అన్ని రకాలుగా కలిసొచ్చిన ఫ్రాంచైజీని వదలడానికి హార్దిక్ వద్ద వేరే కారణాలు కన్పించడం లేదు. ఆర్ధికాంశాల్లో టీమ్ తో ఉన్న విబేధాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. తన ఫీజు పెంచాలని డిమాండ్ చేయడం, తన కోసం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవకాశాలు కోరడాన్ని ఫ్రాంచైజి యాజమాన్యం తిరస్కరించింది. ప్రపంచకప్‌కు ముందే ముంబై ఇండియన్స్ జట్టుతో హార్దిక్ పాండ్యా చర్చలు జరిపినట్టుగా సమాచారం. 36 ఏళ్లు దాటిన రోహిత్ శర్మ మరెంతో కాలం ఐపీఎల్ ఆడే అవకాశం లేకపోవడంతో ఆ జట్టుకు కెప్టెన్ అవకాశాలు దక్కుతాయనే ఆశ కూడా హార్దిక్‌లో ఉంది. 


గుజరాత్ జట్టు పాండ్యాను విడుదల చేయకుండానే ట్రేడింగ్ ద్వారా ముంబై జట్టు సొంతం చేసుకుంది. వేలంలో అయితే దాదాపు అన్ని జట్లు పాండ్యాపై ఆసక్తి చూపించవచ్చు. అందుకే ట్రేడింగ్ ప్రక్రియలో ముంబై ఇండియన్స్ ..గుజరాత్ యాజమాన్యంతో మాట్లాడి భారీ మొత్తం అనధికారికంగా ఇవ్వనుందని సమాచారం. ఎందుకంటే ముంబై వ్యాలెట్‌లో ఉన్నది 5 కోట్లే. కోట్ల జోఫ్రా ఆర్చర్, 17.5 కోట్ల కామెరూన్ గ్రీన్‌ను ముంబై విడుదల చేసే అవకాశాలున్నాయి.


అంటే కేవలం ఆర్ధిక కారణాలతో హార్దిక్ పాండ్యా అన్ని విధాలుగా కలిసొచ్చిన ఫ్రాంచైజీని వదలడం సరైన నిర్ణయం కాదనే విమర్శలు వస్తున్నాయి. అన్ని సందర్భాల్లో డబ్బు కోసమే అన్నీ చేయకూడదని విమర్శిస్తున్నారు. 


Also read: IND vs AUS 2nd T20I Updates: రేపే ఆసీస్‌తో రెండో టీ20.. పిచ్ ఎవరికి అనుకూలం..? తుది జట్టులో ఎవరు ఉంటారు..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook