Harmanpreet Kaur breaks down: టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం కేప్ టౌన్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తమ మార్క్ చూపించకుండానే ముగ్గురు బ్యాటర్స్ పెవిలియన్ బాటపట్టారు. అయినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరూ కలిసి దాదాపు మ్యాచ్ ఫలితాన్ని మార్చే దిశగా తీసుకెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ (52 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (43 పరుగులు) చేసి మళ్లీ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తేలా చేశారు. భారత మహిళల జట్టు చేజింగ్ తీరు చూసి ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు సైతం తాము గెలుస్తామనే ఆశలు వదిలేసుకున్నంత పనయ్యింది. భారత మహిళల జట్టు చేజింగ్ స్పెక్టేటర్స్‌కి స్పూర్తిదాయకంగా నిలిచింది. కానీ అంతిమంగా విజయానికి 5 పరుగులు దూరంలో భారత్ తమ ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.


మ్యాచ్‌లో ఓటమి చెందడంతో హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా పోరాటం వృధా అయింది. దీంతో మ్యాచ్ అనంతరం అక్కడే ఉన్న మహిళల జట్టు మాజీ కేప్టేన్ అంజుం చోప్రాను హత్తుకుని హర్మన్ ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది. అంతకంటే ముందు జరిగిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా సన్‌గ్లాసెస్ పెట్టుకుని తన కన్నీళ్లు కనపడకుండా జాగ్రత్తపడింది. కానీ అంజుం చోప్రాను హత్తుకున్న క్రమంలో ఆమె తనలోని ఆవేదనను ఆపుకోలేక ఉద్వేగానికి గురయ్యారు. 



 


ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్‌ని ఓదార్చిన అంజుం చోప్రా.. ఆమె వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్‌ని అభినందిస్తూ ఆమె శక్తిసామర్ధ్యాల గురించి అంజుం చోప్రా సైతం పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే.. మ్యాచ్ ఓడినప్పటికీ.. వారి పోరాట పటిమతో ఎన్నో హృదయాలను గెల్చుకున్నారు.


ఇది కూడా చదవండి : Ind vs Aus Womens T20 World Cup: పోరాడి ఓడిన భారత్.. హర్మన్ ప్రీత్, జెమిమా కష్టం వృథా


ఇది కూడా చదవండి : Team India: రోహిత్ శర్మ వారసుడు రెడీ అవుతున్నాడు.. దూసుకువస్తున్న పాండ్యా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook