Ind vs Aus Womens T20 World Cup: పోరాడి ఓడిన భారత్.. హర్మన్ ప్రీత్, జెమిమా కష్టం వృథా

Ind vs Aus Womens T20 World Cup Semi Final Match: ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే.. భారత్‌కి గెలిచే అవకాశం, అర్హత రెండూ లేవనిపించేలా ఉంది. కానీ చేజింగ్‌లో మాత్రం ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. హర్మన్ ప్రీత్ కౌర్ (52 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (43 పరుగులు) కొనసాగించిన పోరాటపటిమ చూస్తే మళ్లీ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 10:55 PM IST
Ind vs Aus Womens T20 World Cup: పోరాడి ఓడిన భారత్.. హర్మన్ ప్రీత్, జెమిమా కష్టం వృథా

Ind vs Aus Womens T20 World Cup Semi Final Match: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తుది వరకు పోరాడి ఓటమిపాలైంది. 173 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 5 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆదివారం జరగనున్న అంతిమ పోరులో ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికా జట్లలో ఏదైనా ఒక జట్టుతో తలపడేందుకు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే.. భారత్‌కి గెలిచే అవకాశం, అర్హత రెండూ లేవనిపించేలా ఉంది. కానీ చేజింగ్‌లో మాత్రం ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. హర్మన్ ప్రీత్ కౌర్ (52 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (43 పరుగులు) కొనసాగించిన పోరాటపటిమ చూస్తే మళ్లీ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తాయి. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టుకే గెలుస్తామనే ఆశలు గల్లంతయ్యాయి. భారత మహిళల జట్టు అంత స్పూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. కానీ అంతిమంగా విజయానికి 5 పరుగులు దూరంలో ఆగిపోవడంతో విజయం ఆస్ట్రేలియా వశమైంది.

కేప్ టౌన్‌లో జరిగిన సమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీమ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. బెత్ మూనీ 37 బంతుల్లో 54 పరుగులు చేయగా.. స్కిప్పర్ మెగ్ ల్యానింగ్ 34 బంతుల్లో49 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా రెచ్చిపోయి ఆడగా మరోవైపు ఫీల్డింగ్‌లో టీమిండియా మహిళల జట్టు తప్పిదాలు కూడా ఆస్ట్రేలియా జట్టుకు కలిసొచ్చాయి. మొత్తానికి ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఏడోసారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ఎంటర్ అయినట్టయింది.

ఇది కూడా చదవండి : IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్.. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌కు ప్రమోషన్

ఇది కూడా చదవండి : Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News