Almonds Benefits: డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవంటే అతిశయోక్తి లేదు. చాలామందికి డ్రై ఫ్రూట్స్ ఎలా తింటే మంచిదనే సందేహం ఉంటుంది. నిస్సందేహంగా డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడూ నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు రెట్టింపవుతాయి. డ్రై ఫూట్స్ పేరు చెప్పగానే ముందుగా విన్పించేది బాదం. ఎందుకంటే పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బాదం నీళ్లలో నానబెట్టి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదంలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. బాదంను నానబెట్టి తినడం వల్ల విటమిన్ ఇ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. ఫలితంగా చర్మానికి నిగారింపు వస్తుంది. శరీరంపై ముడతలు ఉంటే దూరమౌతాయి. చర్మానికే కాకుండా కేశాలు పటిష్టంగా, బలోపేతంగా ఉంటాయి. అంతేకాకుండా నిగనిగలాడుతుంటాయి. అదే సమయంలో మెదడును యాక్టివ్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడును చురుగ్గా ఉండేట్టు చేస్తాయి. 


బాదంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. నానబెట్టిన బాదం తినడం వల్ల గుండె వ్యాధుల ముప్పు చాలావరకూ తగ్గుతుందని వివిధ రకాల అధ్యయనాల్లో వెల్లడైంది. బాదంలో ఫైబర్, విటమిన్ ఇ కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే రోజూ బాదం నానబెట్టి తినడం వల్ల కడుపు సంబంధిత వ్యాధుల్ని దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 


అన్నింటికంటే ముఖ్యంగా బాదంను రోజూ నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా రక్తంలో చెక్కర శాతం అద్భుతంగా నియంత్రణలో ఉంటుంది. దీనికోసం రోజుకు 7-9 బాదం నానబెట్టి తినాల్సి ఉంటుంది. డయాబెటిస్ అదుపు చేసేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. 


Also read: Microwave Safe Or Not: మైక్రోవేవ్‌ను వినియోగించడం మంచిదేనా? ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook