Microwave Safe Or Not?: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్నారు. దీని కారణంగా అన్ని పనులు మరింత సులభతరమవుతున్నాయి. దీని తోడు సాంకేతిక కూడా పెరుగుతూ వస్తోంది. చాలా మంది అన్ని పనులు సులభంగా చేసుకోవడానికి ఎక్కువగా ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగిస్తున్నారు. వంట గదిలో కూడా చాలా మంది ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నారు. ప్రస్తుతం వంటగదిలో ఎక్కువగా వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వస్తువుల్లో మైక్రోవేవ్ ఒకటి. ఆహార పదార్థాలను బేకింగ్ చేసేందుకు మైక్రోవేవ్‌ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రస్తుత చాలా మంది తమ సౌలభ్యం కొరకు ఎక్కువగా దీనిని వినియోగిస్తున్నారు..కానీ మైక్రోవేవ్ సరిగ్గా వాడుతున్నారా? మైక్రోవేవ్ సురక్షితమేనా? మైక్రోవేవ్ వినియోగంలో చేస్తున్న తప్పు ఏంటి? దీనిని వినియోగించే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోవేవ్ వినియోగిస్తున్నారా?
మైక్రోవేవ్ వినియోగించేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారాలను బేక్ చేసే క్రమంలో ఇది ఏ డిగ్రీ సెల్సియస్‌లో ఉపయోగించాలి. ఎలాంటి ఆహార పదార్థాలకు ఎంత డిగ్రీ సెల్సియస్ అవసరం? అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
మైక్రోవేవ్ ఉపయోగించడం సురక్షితమేనా?
కొంతమందికి మైక్రోవేవ్ ఉపయోగించడం ఎంతవరకు మంచిదనే ప్రశ్న రావొచ్చు. ఈ ప్రశ్న మీరు వినియోగించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మైక్రోవేవ్ వినియోగించేవారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే..మైక్రోవేవ్‌కు సరిపడ కంటైనర్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మైక్రోవేవ్ కంటైనర్లను వినియోగించి మాత్రమే ఆహారాలను బేక్ చేసుకోవడం చాలా మంచిది.
ఈ తప్పకుండా అస్సుల చేయోద్దు:
మైక్రోవేవ్‌లో అల్యూమినియం ఫాయిల్ వినియోగం:
ప్రస్తుతం చాలా మంది మైక్రోవేవ్‌లో అల్యూమినియం ఫాయిల్‌ని వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం మంచిదికాదని నిపుణులు సూచిన్నారు. రోటీ లేదా ఇతర ఆహారాలను అల్యూమినియం ఫాయిల్‌లో వేడి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మైక్రోవేవ్‌లో మంటలు ఏర్పడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.
మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ కంటైనర్ వినియోగించవచ్చా?:
మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ కంటైనర్‌ను వినియోగించడం కూడా మంచిది కాదు. ఇలాంటి డబ్బాల్లో వేడిచేసిన ఆహారాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్లాస్టిక్ కంటైనర్స్ వినియోగం తగ్గించుకోవడం చాలా మంచిది.
మైక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెట్టడం:
ప్రస్తుతం చాలా మంది మైక్రోవేవ్‌లో గుడ్లు ఉడకబెడుతున్నారు. ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థిస్తుల్లో చేయకూడదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఉడకబెట్టడం వల్ల మైక్రోవేవ్ పేలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి