Hijab Controversy: ప్రస్తుతం దేశంలో చెలరేగుతోన్న హిజాబ్ వివాదంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా స్పందించారు. హిజాబ్ ధరించిన బాలికలను స్కూల్ గేట్ బయటే నిలిపివేసే వీడియో ఇటీవలే వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన గుత్తా జ్వాలా.. ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బాలికలను పాఠశాల గేట్ వద్ద అవమానించడం మానుకోండి. వారు తమ కాళ్లపై తాము ఎదిగేందుకు వచ్చారు. చిన్న హృదయాలను అవమానించి బాధించడం మానుకోండి" అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్ చేశారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



హిజాబ్ వివాదం ఏమిటి?


కర్ణాటకలో ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఈ హిజాబ్ వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇది దేశంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు విస్తరించింది. ఇదే విషయమై విద్యాసంస్థలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించి.. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె స్పష్టం చేశారు. ఆ తర్వాత హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన కోర్టు.. హిజాబ్ ధరించి వచ్చిన వారికి విద్యాసంస్థల్లో ప్రవేశం లేదని కోర్టు తీర్పునిచ్చింది.


ఈ తీర్పుకు అనుగుణంగా మాండ్యాలోని రోటరీ స్కూల్ కు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను యాజమాన్యం అనుమతించలేదు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి.  


Also Read: Hijab Row: హిజాబ్ లేకపోవడం వల్లనే దేశంలో అత్యాచారాలు


Also Read: Hijab row: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం- అల్లర్లు సృష్టించే వారికి సీఎం వార్నింగ్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook