Hijab row: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం- అల్లర్లు సృష్టించే వారికి సీఎం వార్నింగ్​!

Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 06:11 PM IST
  • రేపటి నుంచి కర్ణాటకలో స్కూళ్లు పునఃప్రారంభం
  • ప్రశాంతంగా క్లాసులు జరిగేలా చూడాలని సీఎం సూచన
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన బసవరాజ్ బొమ్మై
Hijab row: రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం- అల్లర్లు సృష్టించే వారికి సీఎం వార్నింగ్​!

Hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో గత వారం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. సోమవారం నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు తెరవానున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించింద కర్ణాటక ప్రభు్తవం.

ఈ నేపథ్యంలో సమస్యలు సృష్టించే వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. పోలీసులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే సందేశాలను పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. దీనితో ఎవరైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే.. ఇతర మార్గాల ద్వారా కూడా తెలుకుంటారని స్పష్టం చేశారు.

స్కూళ్లు, కాలేజీలు వీలైనంత త్వరగా తెరిచి.. చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కూడా మార్చిలో రానున్న పరీక్షలపై దృష్టి పెట్టాలని.. ఇతర విషయాలను దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయన్నారు సీఎం.

'స్కూళ్లు సోమవారం నుంచి తెరవనున్నాం. ప్రశాంతంగా క్లాసులు నిర్వహించేలా చూడాలని జిల్లా కమిషనర్లను, పాఠశాలల యాజమాన్యాలకు సూచించాం.' అని వెల్లడించారు సీఎం.

ఏమిటి హిజాబ్ వివాదం..

గత కొంత కాలంగా కర్ణాటకలో హిజాబ్​ వివాదం కొనసాగుతోంది. కొంత మంది పాఠశాలలకు హిజాబ్​ ధరించి రావడం పట్ల కొంత మంది నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారినట్లు.. రాజకీయ పార్టీలకూ తాకింది.

గత వారం ఈ వివాదంపై కోర్టు విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

Also read: IRCTC guidelines: రైల్వే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు- ఆ నిబంధనలు తప్పనిసరి!

Also read: Young Woman Raped: కదులుతున్న ట్రైన్​లో యువతి అత్యాచారం- సీటు ఇస్తానని నమ్మించి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News