Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మరో పతకం వచ్చి చేరింది. జాతీయ క్రీడ అయిన హాకీలో పురుషుల జట్టు కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. తృటిలో ఫైనల్‌ అవకాశాన్ని కోల్పోయి స్పెయిన్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది. 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన హకీ ఆటగాళ్లు కాంస్య పతకాన్ని ముద్దాడారు. పురుషుల హకీలో మూడో స్థానంలో నిలిచి భారతదేశం మెడలో మరో మెడల్‌ వేశారు. టోక్యో ఒలింపిక్స్ లో కూడా భారత జట్టు కాంస్యం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత హకీ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు అభినందించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశం

ఉత్కంఠగా..


పతక పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లకు ఒక్క గోల్‌ కూడా దక్కకపోవడంతో రెండో దశలో గోల్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. రెండో క్వార్టర్‌ ఆరంభంలో 18వ నిమిషానికి స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ భారత్‌కు షాకిచ్చాడు. పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చి ఆధిక్యంలో తీసుకొచ్చాడు. ఒత్తిడికి గురయిన భారత ఆటగాళ్లు గోల్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. రెండో క్వార్టర్‌ చివరి దశలో లభించిన పెనాల్టీ కార్నర్‌న్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ గోల్‌ మార్చి బోణీ చేశాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.


Also Read: Vinesh Phogat: చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగట్‌.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశం


రికార్డు విజయం
మూడో క్వార్టర్‌ ప్రారంభంలోనే పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ ప్రీత్‌ మరోసారి గోల్‌గా చేయడంతో సంబరాలు మిన్నంటాయి. 2-1తో ఆధిక్యంలోకి వచ్చిన భారత్‌ చివరి వరకు అదే కొనసాగడంతో విజయం లభించింది. ప్రత్యర్థి జట్టు గోల్‌ కోసం ప్రయత్నించగా మనవాళ్లు అద్భుతంగా అడ్డుకుంటూనే గోల్స్‌ కోసం ప్రయత్నాలు చేశారు. చివరి వరకు స్పెయిన్‌ పోరాడినా నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో భారత్‌ రికార్డు నెలకొల్పింది. 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకున్న జట్టుగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌ కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. 1968, 1972లో కూడా ఇలాగే వరుసగా కాంస్య పతకాలు గెలుచుకుంది.


ఒలింపిక్స్ కు శ్రీజేశ్ వీడ్కోలు
సెమీ ఫైనల్స్‌లో జర్మనీతో భారత హకీ జట్టు హోరాహోరీగా తలపడింది. 3-2తో తృటిలో రజత పతకం భారత్‌కు చేజారింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌ 2 జట్టు బ్రిటన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. భారత హకీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌కు ఇదే చివరి ఒలింపిక్స్‌ కావడం గమనార్హం. ఈ సందర్భంగా మ్యాచ్‌ ముగిసిన అనంతరం శ్రీజేశ్‌కు జట్టు ఆటగాళ్లంతా అభినందనలతో ముంచెత్తారు. చివరి ఒలింపిక్స్‌ కావడంతో శ్రీజేశ్‌కు కాంస్య పతకం అంకితం చేస్తారని చర్చ జరుగుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter