2024 T20 World Cup: ప్రపంచకప్ కు అదే ఫైనల్ టీమ్ కాదు... రాహుల్ కు కూడా ఛాన్స్ ఉంది.. ఎలాగంటే?
T20 World Cup 2024: జూన్ 01 నుంచి యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే జట్లన్నీ టీమ్స్ ను ప్రకటించాయి.
Team India Squad for T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ మెుదలైంది. జట్లన్నీ తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్నీ జట్లు తమ టీమ్స్ ను ప్రకటించాయి. భారత్ కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. ఇందులో నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ గా ఉంచారు. అయితే ఇదే తుది జట్టు కాదంట. మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉందట. ఎందుకంటే ఇప్పటికే ఎంపిక చేసిన ఆటగాళ్లు టోర్నీ ప్రారంభానికి ముందు గాయపడినా లేదా ఏ ఇతర కారణాల వల్ల వైదొలిగినా వారి స్థానంలో కొత్త ఫ్లేయర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇలా మార్పు చేయాలంటే ముందుగా ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది.
ప్రస్తుతం ఐపీఎల్ చివరి దశకు చేరుకుంటుంది. ఫ్లే ఆఫ్ రేసులో ఉండే జట్లు ఏవో మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచకప్ కు ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఐపీఎల్ విఫలమైతే వారి నుంచి జట్టు నుంచి తప్పించే వేరే వారిని తీసుకునే అవకాశం ఉంది. 2021 టీ0 ప్రపంచకప్ లో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ ను ఇలానే తీసుకున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కూడా ఇలాంటి మార్పులు భారత జట్టులో చోటుచేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.
రాహుల్ కు ఛాన్స్!
చాలా మంది ఇప్పటికే రిజర్వు ఫ్లేయర్స్ లిస్ట్ లో ఉన్న టీమిండియా ప్రిన్స్ శుభ్ మన్ గిల్, నయా ఫినిషర్ రింకూసింగ్ ఫ్లేయింగ్ 11లో చోటు దక్కాలని భావిస్తున్నారు. చాలా మంది టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఐపీఎల్ లో మిగతా మ్యాచుల్లో మరింత బాగా ఆడితే రాహుల్ కు కూడా చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: T20 World Cup 2024: తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడబోతున్న భారత ఫ్లేయర్లు వీళ్లే..!
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter