Babar Azam explains to umpire Anil Chaudhary in PAK vs SL Match: ఆసియా కప్‌ 2022 సూపర్‌ 4లో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (30; 29 బంతుల్లో 2×4), మహ్మద్‌ నవాజ్‌ (26; 18 బంతుల్లో 1×4, 2×6) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. వానిందు హసరంగ (3/21) చెలరేగాడు. ఛేదనలో లంక 17 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. నిశాంక (55 నాటౌట్; 48 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. భానుక రాజపక్స (24), దాసున్ శనక (21) విలువైన రన్స్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక ఇన్నింగ్స్‌ సందర్భంగా హాసన్‌ అలీ 16 ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఆ ఓవర్లోని రెండో బంతిని అలీ షార్ట్ పిచ్ అవుట్ ఆఫ్ వేశాడు. షనక షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. బంతి మిస్స్‌ అయి నేరుగా వికెట్‌ కీపర్‌ మొహ్మద్ రిజ్వాన్‌ చేతిలో పడింది. బంతి బ్యాట్‌కు తగిలిందిని భావించిన బౌలర్ అలీ, కీపర్ రిజ్వాన్‌ క్యాచ్‌కు అప్పీల్‌ చేశారు. ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి మాత్రం వీరి అప్పీల్‌ను తిరస్కరించాడు. వెంటనే రిజ్వాన్‌ రివ్యూ కోసం అంపైర్‌కు సిగ్నల్ ఇచ్చాడు. ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. 


అసలు ఏం జరుగుతుందో అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి వైపు వెళుతూ.. 'నేనే పాకిస్తాన్ కెప్టెన్‌ని.. మొహ్మద్ రిజ్వాన్‌ కాదు' అని చేతులతో సైగలు చేస్తాడు. అది చూసిన రిజ్వాన్‌ నవ్వులు పూయిస్తాడు. ఆపై అందరూ కలిసి అంపైర్‌ వద్దకు వెళ్లి మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చివరకు బంతి బ్యాట్‌కు తాకలేదని రిప్లేలో తెలింది. దీంతో అంపైర్‌ షనకను నాటౌట్‌గా ప్రకటించాడు.



సాధారణంగా క్రికెట్‌లో కెప్టెన్‌ రివ్యూకి సిగ్నల్‌ చేస్తేనే.. ఫీల్డ్‌ అంపైర్‌ అంగీకరించి థర్డ్‌ అంపైర్‌కి రిఫర్‌ చేయాలి. అయితే ఈ మ్యాచులో మాత్రం కెప్టెన్‌తో సంబంధం లేకుండా వికెట్‌ కీపర్‌ సూచనల మేరకు క్రికెట్‌ అంపైర్‌ రివ్యూకు రిఫర్‌ చేశాడు. దాంతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్.. అంపైర్‌పై నిరాశ వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ అంపైర్‌ అయిన అనిల్‌ చౌదరి కూడా ఇలా చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. 


Also Read: Jadeja BCCI: కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా.. రవీంద్ర జడేజా గాయంపై బీసీసీఐ ఫైర్!


Also Read: Weight Loss Tips: బరువు తగ్గడంలో అరటి పండ్లు సహాయపడుతాయా?.. ఈ విషయం తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి