Ian Bishop feels RCB difficult to reach IPL 2022 playoffs: ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 145 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేదించలేకపోయింది. స్టార్ బ్యాటర్లు ఉన్న బెంగళూరు జట్టు 115 పరుగులకే ఆలౌట్ అవ్వడం అందరిని ఆచ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ (9), ఫాఫ్ డుప్లెసిస్ (23), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), వానిందు హాసరంగా (18), దినేష్ కార్తీక్ (6)లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరుకు వరుసగా ఇది రెండో ఓటమి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు అడగా.. అయిదింట్లో గెలిచి 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో బెంగళూరు ప్రస్తుతం అయిదో స్థానంలో ఉన్నా.. బ్యాటర్లు వరుసగా విఫలమవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా గత రెండు మ్యాచులో ఫాఫ్ సేన ఆట మరీ దారుణంగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై 68 పరుగులే చేసిన బెంగళూరు.. రాజస్థాన్‌పై 115 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటముల నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పందించారు. 


తాజాగా ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో ఇయాన్ బిషప్ మాట్లాడుతూ... 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శన నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం.. 68 పరుగులకే ఆలౌట్ అవవడం కంటే దారుణమైంది. ఈ ఏడాదికి ఒక బ్యాడ్ గేమ్ ఉంటే ఇదే చివరిది కావాలి. ఇప్పటికైనా బెంగళూరు మళ్లీ పుంజుజుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగే ఆడితే మాత్రం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే. ఆటగాళ్లు అందరూ కఠోరంగా శ్రమించాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. 


'విరాట్ కోహ్లీ ఇప్పటివరకు తన స్థాయిలో పరుగులు చేయలేదు. నేను ఇప్పటికీ అతడి నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్ చూడలేకపోతున్నాను. కోహ్లీ మళ్లీ గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిని తగ్గించుకుని వీలైనంత దూకుడుగా ఉండటం అవసరం. విరాట్ ఊపందుకోగలడు. బౌలర్లపై ఒత్తిడిని తిరిగి తీసుకురాగలడు. క్రీజ్‌లో కోహ్లీ ఎదుర్కొనే ఒత్తిడిని ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీసుకోవాలి. ఈ ఇద్దరు పరుగులు చేస్తే కోహ్లీ సునాయాసంగా రన్స్ చేసే అవకాశం ఉంది' అని కామెంటేటర్ ఇయాన్ బిషప్ పేర్కొన్నారు. 


Also Read: Sekhar Kammula Leader 2: 'లీడర్' మూవీ సీక్వెల్‌లో రానాకు బదులు ఆ స్టార్ హీరో...?


Also Read: Vijay Babu Rape Case: హీరో విజయ్ పై రేప్ కేసు నమోదు.. విజయ్ కోసం పోలీసుల గాలింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.