ICC T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ(ICC) విడుదల చేసింది. యూఏఈ(UAE), ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌(Dubai)ని నిర్ణయించారు. అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 17న ఆతిథ్య ఒమన్(Oman), పపువా న్యూగినియా(Papua New Guinea)ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. రౌండ్‌ 1లో భాగంగా.. గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్(Qualifiers) మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup) నకు అర్హత సాధిస్తాయి. 



Also Read: IND VS ENG: లార్డ్స్‌లో భారత్ సంచ‌ల‌న విజ‌యం..బుమ్రా, షమి మెరుపులు..సిరాజ్ సూపర్ బౌలింగ్!


అక్టోబర్‌ 23న ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa) మధ్య జరగనున్న మ్యాచ్‌తో సూపర్‌ 12 లీగ్‌ స్టేజీ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక సూపర్‌ 12లో గ్రూప్ 2లో ఉన్న భారత్‌(India).. అక్టోబర్‌ 24న దాయాది పాకిస్తాన్‌(Pakistan)తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌(New Zealand‌)తో, నవంబర్‌ 3న అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో, నవంబర్‌ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్‌ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్‌ 14వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌(Final Match) జరగనుంది.


భారత్ కాలమాన ప్రకారం టీమిండియా(India) మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతాయి. అయితే టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup) లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook