Australia: ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. టీమ్ ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఇండియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియాకు విజయగర్వం పట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం వైరల్ అవుతున్న ఈ ఫోటో.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియాపై ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ట్రోఫీని అగౌరవపర్చారనే ఆరోపణలు ఇవి. ఇది నిజం కూడా. దీనికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో. ఈ ఫోటోలో సోఫాలో కూర్చున్న మిచెల్ మార్చ్ కుడి చేత్తో బీర్ బాటిల్ పట్టుకున్నాడు. రెండు కాళ్లు రిలాక్స్డ్‌గా జారబడి ప్రపంచకప్ ట్రోఫీపై పెట్టుకుని పోజిచ్చాడు. అందుకే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టుకోవడమేంటని విమర్శిస్తున్నారు. ట్రోఫీ అంటే కాస్త గౌరవం ఉండాలంటున్నారు. ఇంత బలుపు పనికిరాదంటున్నారు. ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మండిపడుతున్నారు.


మిచెల్ మార్ష్ నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 15 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అటు బౌలింగ్‌లో 2 ఓవర్ల చేసి కేవలం ఐదు పరుగులిచ్చాడు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత బరిలో దిగిన ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు.



అటు ఆస్ట్రేలియా కూడా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా ఆ తరువాత 4వ వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఏకంగా 192 పరుగులు జోడించాడు. ట్రావిస్ హెడ్, లాబుస్ షాగ్నేలు. ఆరవసారి టైటిల్ గెలిచిన సంబరాల్లో మునిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయగర్వంతో ట్రోఫీని అగౌరవపర్చడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Also read: Team india Pics: కంట కన్నీరు, విషన్న వదనాలు, బరువెక్కిన గుండెతో టీమ్ ఇండియా ఆటగాళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook