Ind vs Nz Match Tickets: దేశంలో క్రికెట్ ఆటకు క్రేజ్ చాలా ఎక్కువ. అందులో క్రికెట్ ప్రేమికులకు హైవోల్టేజ్‌లో కన్పించే ప్రపంచకప్  2023 ఇండియాలోనే జరుగుతుండటంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇండియా దుమ్మురేపే ప్రదర్శనతో ముందుకు సాగుతుంటే ఇంకేముంది అభిమానుల్ని ఎవరు ఆపగలరు. అందుకే టికెట్లకు ఈ పరిస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023 మొదటి సెమీఫైనల్స్ రేపు అంటే నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్డేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌లు గెలిచి 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ ఇండియాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇండియా కచ్చితంగా రేపటి సెమీస్ నెగ్గి న్యూజిలాండ్‌పై గత ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా ఫైనల్ చేరాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియా ఎలా దుమ్ము రేపే ప్రదర్శనతో దూసుకుపోతుందో రేపటి మ్యాచ్‌కు టికెట్లు కూడా అదే విధంగా బ్లాక్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. టికెట్ల రేటు భారీగా పెరిగిపోయింది. బ్లాక్‌లో 27 వేల నుంచి 2.5 లక్షల వరకూ విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. 


అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఇండియా సెమీస్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుండటంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది. ముంబైలోని వాంఖడే స్డేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ ఒక్కొక్కటి 2500-5000 గా టికెట్లు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ముంబై క్రికెట్ అసోసియేషన్ విక్రయం ప్రారంభించిన కాస్సేపటికే టికెట్లన్నీ అయిపోయాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్‌ను 100 రెట్లు అధికంగా అమ్ముతున్న ఓ ముంబైవాసిని పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశ్ కొఠారి అనే ఓ వ్యక్తి తన వద్ద ఉన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ టికెట్‌ను విక్రయిస్తున్నట్టుగా పోస్టు చేశాడు. దీని ధర 27 వేల నుంచి 2.5 లక్షల వరకూ డిమాండ్ చేస్తుండటంతో ముంబై పోలీసులు రంగంలో దిగారు. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420, 511 ప్రకారం కేసు నమోదు చేశారు. రేపటి మ్యాచ్ టికెట్లను దాదాపు 10 వరకూ ఇదే విధంగా బ్లాక్‌లో విక్రయించి 5 లక్షలు సంపాదించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 


Also read: IND Vs NZ ICC World Cup 2023: భారత్‌ను వెంటాడుతున్న ఆ గండం.. సెమీ ఫైనల్స్ రికార్డులు ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook