Rachin Ravindra: వరల్డ్ కప్‌లో దుమ్ములేపుతున్న రచిన్ రవీంద్ర.. రాహుల్ ద్రావిడ్, సచిన్‌తో ఉన్న లింక్ ఇదే..!
Rachin Ravindra In Icc World Cup 2023: న్యూజిలాండ్ జట్టు తరుఫున దుమ్ములేపే ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర. వరుసగార రెండు మ్యాచ్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎవరు రచిన్ రవీంద్ర..? రాహుల్ ద్రావిడ్, సచిన్‌కు ఉన్న లింక్ ఏంటి..?
Rachin Ravindra In Icc World Cup 2023: తల్లిదండ్రులకు రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం. తమ బిడ్డకు ఎవరి పేరు పెట్టాలా..? అని ఆలోచించారు. చివరికి ఇద్దరి పేర్లు వచ్చేలా ఓ పేరు ఆలోచించారు. రాహుల్ ద్రావిడ్ ర అక్షరాన్ని.. సచిన్ పదంలో చిన్ అక్షరాలను రచిన్ అని పెట్టుకుని చివరకు రచిన్ రవీంద్ర అని నామకరణం చేశారు. అతను కూడా ఆ దిగ్గజాల మాదిరే గొప్ప క్రికెటర్ కావాలని కలలుగన్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌కు ఎంపికై వరల్డ్ కప్‌లో సూపర్ ఫామ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటగా.. నేడు నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది బెంగుళూరు. అయితే వీళ్లు 1990లో న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడిపోయారు. అక్కడే పుట్టి పెరిగిన రచిన్.. తన తండ్రి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్‌లో క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. న్యూజిలాండ్ అండర్-19, ఏ జట్లకు ఆడుతూ చిన్న వయసులో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ.. కివీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2021లో రవీంద్ర బంగ్లాదేశ్‌తో మిర్పూర్‌లో తొలిసారి టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌తో ఔట్ అయ్యాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. దీంతో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్‌గా మిగిలింది. ఆ తరువాత టెస్టులు, వన్డేల్లోనూ చోటు దక్కించుకుని సత్తాచాటాడు. రవీంద్ర న్యూజిలాండ్ తరఫున మూడు టెస్టుల్లో 73 పరుగులు, 13 వన్డేల్లో 312 పరుగులు, 18 టీ20ల్లో 145 పరుగులు చేశాడు.
రవీంద్ర తండ్రి, భారత దిగ్గజ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్‌కు సన్నిహిత మిత్రుడు, న్యూజిలాండ్‌లోని హట్ హాక్స్ క్రికెట్ క్లబ్ వ్యవస్థాపకుడు. అతను తన క్రికెట్ క్లబ్‌లోని యువ ఆటగాళ్లను ప్రతి సంవత్సరం భారతదేశానికి తీసుకువస్తాడు. అనంతపురంలో ఉన్న ఆర్‌డీటీలో వారితో క్రికెట్ మ్యాచ్‌లు ఆడించేవారు. ఇంగ్లాండ్‌పై తొలి మ్యాచ్‌లో కేవలం 96 బంతుల్లోనే 123 పరుగులు చేసిన రచిన్.. నేడు నెదర్లాండ్స్‌పై 51 పరుగులతో రాణించాడు. ఈ వరల్డ్ కప్‌ల్ రచిన్ న్యూజిలాండ్‌కు కీప్లేయర్‌గా మారనున్నాడు.
Also Read: CM KCR: ఎన్నికల రంగంలోకి సీఎం కేసీఆర్.. ఆ రోజే మేనిఫెస్టో ప్రకటన
Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి