World Cup 2023 Semis Chances: ప్రపంచకప్ 2023లో నిన్న జరిగిన కివీస్ వర్సెస్ ప్రోటీస్ మ్యాచ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు సజీవం చేసింది. ఇతర జట్లు ఓడిపోయేకొద్దీ ఈ రెండు దేశాలకు ముఖ్యంగా పాక్ సెమీస్ అవకాశాలు మెరుగౌతుంటాయి. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు తమ ఆటతో పాటు అదృష్టాన్ని కూడా నమ్మకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా అప్రతిహంగా విజయాలతో దూసుకుపోతుంటే ప్రత్యర్ధి దాయాది దేశం పాక్ మాత్రం అపజయాలతో వెనుకబడిపోయింది. టీమ్ ఇండియా 6 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ మాత్రం 7 మ్యాచ్‌లు ఆడి మూడింట విజయంతో 6 పాయింట్లు దక్కించుకుంది. రన్‌రేట్ కూడా మైనస్‌లో ఉంది. పాకిస్తాన్‌తో పోటీగా ఆఫ్ఘనిస్తాన్ 6 మ్యాచ్‌లు ఆడి మూడింట విజయంతో ఆరు పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో పాకిస్తాన్ ఐదవ స్థానంలో నిలిచింది. నిన్న జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించడంతో పాకిస్తాన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు సజీవమయ్యాయి. 


పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు


ఎందుకంటే ఇప్పటి వరకూ ఆరు పాయింట్లు సాధించిన పాకిస్తాన్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఈ రెండింట్లో భారీ తేడాతో విజయం సాధిస్తే 10 పాయింట్లకు చేరుకుంటుంది. ఇక ఆఫ్ఘానిస్తాన్ జట్టుకు ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడింట గెలిస్తే 12 పాయింట్లతో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌కు దాదాపుగా అర్హత సాధించవచ్చు. కానీ ఒకటి ఓడి రెండు గెలిచినా లేదా రెండింట ఓడినా పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు పెరుగుతాయి. 


అయితే అదే సమయంలో పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకూ మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మిగిలిన 3 మ్యాచ్‌లలో కనీసం రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి. ఇది దాదాపుగా అసాధ్యం కాబట్టి ఇక న్యూజిలాండ్ పరాజయంపై ఆధారపడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ భారీ తేడాతో ఓడితే పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. 


అంతకంటే ఎక్కువగా పాకిస్తానా్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచి పది పాయింట్లు సాధిస్తేనే ఈ సాధ్యాసాధ్యాలు పాకిస్తాన్ జట్టును సెమీస్‌కు చేర్చవచ్చు. ఈ సమీకరణాల్లో ఎక్కడ ఏది తేడా కొట్టినా పాకిస్తాన్ గెలిచినా ప్రయోజనం ఉండదు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు తన ఆటను మెరుగుపర్చుకోవడంతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల పరాజయాన్ని కోరుకోవాలి. టీమ్ ఇండియాను రెండవ స్థానం నుంచి పడిపోకుండా చూసుకోవల్సిన బాధ్యత కూడా పాకిస్తాన్‌పైనే ఉంది. 


Also read: World Cup Points: పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా, రన్‌రేట్ కారణంగా రెండవ స్థానంలోనే ఇండియా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook