అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారిగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ ఫైనల్‌కు సౌతాంప్టన్ వేదికగా మారనుంది. ఏడాది కాలంలో టెస్టుల్లో తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన న్యూజిలాండ్, టీమిండియా జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న కివీస్, టీమిండియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం కివీస్ ఆటగాళ్లు ఇదివరకే ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. మరోవైపు టీమిండియా క్రికెటర్లు ఇటీవల తొలి కరోనా డోసు తీసుకోగా, రెండో టీకాను ఇంగ్లాండ్‌లో తీసుకుంటారని తెలిసిందే. కివీస్‌తో జరగనున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సేవలు కీలకం కానున్నాయని హిట్ మ్యాన్‌కు కెరీర్ తొలినాళ్లలో కోచ్‌గా వ్యవహరించిన దినేష్ లాడ్ అభిప్రాయపడ్డారు. ఏడేళ్ల కిందట ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ ఆడగా, సుదీర్ఘకాలం తరువాత బ్రిటీష్ గడ్డపై అతడు ప్రతిష్టాత్మక మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని చెప్పాడు.


Also Read: Sagar Rana Murder Case: సాగర్ రాణాపై దాడిని వీడియో తీయించిన రెజ్లర్ Sushil Kumar


ఏడేళ్ల కిందటికి, ప్రస్తుతానికి రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో అతడు అయిదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా (Team India) రోహిత్ శర్మ బెస్ట్ ఓపెనర్‌గా, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా మారాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద పేసర్ల ప్రభావం అధికంగా ఉంటుంది కనుక మొదట్లో ఆచితూచి ఆడి ఆపై నిలకడగా బ్యాటింగ్ చేస్తే శుభారంభాలు లభిస్తాయని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రోహిత్ శర్మను మాజీ కోచ్ దినేష్ లాడ్ హెచ్చరించారు. మరో స్థాయికి వెళ్లాలంటే నిలకడ సైతం ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు.


Also Read: IPL 2021: ఐపీఎల్ నిర్వహణపై చిగురిస్తున్న ఆశలు, అన్నీ కుదిరితే ఈసారి కొత్త వేదికలో టీ20 టోర్నీ


ఓ ఆటగాడు 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం వేరని, ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించడం ఒకటి కాదన్నారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ ఆత్మరక్షణతో కూడుకున్నది కాగా, ఓపెనర్‌గా అయితే ఆచితూచి ఆడి బౌలర్లపై ఎదురుదాడికి దిగడం సాధ్యమని సలహా ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆకట్టుకుందని, అయితే కొన్ని సందర్బాలలో తేలికగా వికెట్లు చేకూర్చుకోవడం ప్రతికూలాంశమని పేర్కొన్నారు. కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్ రాణిస్తే ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఉంటుందన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook