Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌లో ఉంటే.. ఆ పాలసీకి బలయ్యేవాడు: సల్మాన్
Salman Butt Talks about Suryakumar Yadav`s international cricket Entry. సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్య పాక్‌లో పుట్టి ఉంటే.. అతడికి జాతీయ జట్టులో చోటు దక్కేది కాదన్నాడు.
Salman Butt Talks about Suryakumar Yadav's international cricket Entry: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత జట్టులోకి వచ్చినప్పటినుంచి పరుగుల వరద పారిస్తున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు సింహ స్వప్నంగా మారాడు. మైదానం నలుమూలా పరుగులు చేస్తూ.. ప్రత్యర్థికి కొరకరాని కొయ్యలా మారాడు. తాజాగా శ్రీలంకపై కూడా పొట్టి ఫార్మాట్‌లో అద్భుత శతకం బాదాడు. అయితే సూర్యపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ సూర్య పాక్‌లో పుట్టి ఉంటే.. అతడికి జాతీయ జట్టులో చోటు దక్కేది కాదన్నాడు.
సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'సూర్యకుమార్ యాదవ్ 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడని నేను చదివాను. సూర్య భారతీయుడు కావడటం అదృష్టం. ఒకవేళ పాకిస్థాన్‌లో పుట్టి ఉంటే 30 ఏళ్ల పాలసీకి బాధితుడు అయ్యేవాడు. 30 ఏళ్లు వచ్చేసరికి ఎవరైనా జాతీయ జట్టులో ఉంటే మంచిదే. అలా లేకుంటే వారికి అవకాశాలు రావు. సూర్య 30 ఏళ్ల వయసులో భారత జాతీయ జట్టులోకి వచ్చాడు. సూర్యది ప్రత్యేకమైన కేసు. అతడి ఫిట్‌నెస్, బ్యాటింగ్ శైలి, ఆటలో పరిపక్వత సూపర్. బౌలర్ ఏ బంతి వేయబోతున్నాడో ముందే ఊహిస్తాడు' అని అన్నాడు.
గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రజా.. 30 ఏళ్ల విధానం అనుసరించాడు. ఇందులో భాగంగా 30 ఏళ్లు నిండిన ఏ ఆటగాడికి జాతీయ జట్టులో చేరడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. ఇలానే చాలా మంది మంచి ప్లేయర్స్ అవకాశాలు కోల్పోయారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లు కూడా జట్టులోకి రాలేకపోయారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌ను ఉదాహరణగా చూపుతూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పీసీబీ వైఖరిని తప్పుపట్టాడు.
ముంబై ఇండియన్స్ జట్టు తరపున 2-3 సంవత్సరాలు అద్భుతంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 2021 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2022లో 1000కి పైగా పరుగులు చేసి ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకొన్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ మూడో మ్యాచ్‌లో శతకం బాది కెరీర్‌లో 1500 పరుగుల మైలు రాయిని దాటేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ రికార్డును అందుకొన్న ఏకైక బ్యాటర్ సూర్యనే.
Also Read: Samantha: సరికొత్త లుక్‌లో సమంత.. ఇలా మారిపోయిందేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.