IND Playing XI vs ENG for T20 World Cup 2022 Semi Final: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌ 12లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో గ్రూప్‌ 2 టాపర్‌ హోదాలో భారత్ సెమీస్‌ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. అడిలైడ్‌ వేదికగా గురువారం (నవంబరు 10) మధ్యాహ్నం జరుగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.  భారత్, ఇంగ్లండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో రెండో సెమీస్ హోరాహోరీ సాగడం ఖాయం. కీలక సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌ 12లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు మినహా జట్టును మార్చలేదు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా బరిలోకి దిగగా.. జింబాబ్వే మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ ఆడాడు. ఈ రెండు మార్పులు మినహా  టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే రోహిత్ కొనసాగించాడు. అయితే చేసిన ఈ రెండు మార్పులు కూడా పెద్దగా కలిసిరాలేదు. దీపక్ హుడా, రిషబ్ పంత్‌ ఇద్దరూ విఫలమయ్యారు. 


ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. వరుస రెండు హాఫ్ సెంచరీలతో రాహుల్ ఫామ్ అందుకున్నా.. రోహిత్ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. కీలక సెమీ ఫైనల్లో అయినా రోహిత్ బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ జట్టును ఆడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝులిపించాల్సి సమయం ఆసన్నమైంది.


వరుసగా విఫలమవుతున్న దినేశ్ కార్తీక్ సెమీ ఫైనల్లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. డీకే స్థానంలో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలుబట్టి ఇదే నిజమయ్యేలా ఉంది. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ దృష్ట్యా పంత్ జట్టులో ఉంటే జట్టుకు ఉపయోగమే. అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకుంటే మాత్రం డీకే జట్టులో ఉంటాడు. స్పిన్ కోటాలో ఆర్ అశ్విన్ ఆడుతాడు. అడిలైడ్‌ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అక్షర్ పటేల్ స్థానంలో యుజ్వేంద్ర చహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ పటిష్టంగా ఉండాలనుకుంటే.. అక్షర్ కొనసాగుతాడు. ఇక పేస్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఆడుతారు. 


తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేశ్ కార్తీక్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్/యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. 


Also Read: IND vs ENG: వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?


Also Read: సూర్యకుమార్‌ షాట్స్ చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం.. సెమీస్‌లో అడ్డుకుంటాం: స్టోక్స్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి