IND vs ENG: వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?

If Rain interrupts IND vs ENG Semi Final, India reach T20 World Cup 2022 Final. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో వర్షం పడితే.. ఏ జట్లు ఫైనల్ చేరుతాయో తెలుసా?.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 8, 2022, 02:40 PM IST
  • వర్షం కారణంగా సెమీస్‌ మ్యాచ్ రద్దైతే
  • ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?
  • విజేతగా న్యూజిలాండ్‌, భారత్
IND vs ENG: వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్ రద్దైతే.. ఫైనల్ వెళ్లే జట్టేదో తెలుసా?

What happens if rain interrupts T20 World Cup 2022 India vs England semi-final match: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. బుధవారం (సెప్టెంబర్ 9)  సిడ్నీ క్రికెట్ మైదానంలో మొదటి సెమీ ఫైనల్ న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. అడిలైడ్‌ వేదికగా గురువారం (నవంబరు 10)  భారత్, ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా అన్ని బరిలోకి దిగుతున్నాయి. 

ఇప్పటివరకైతే టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు వరణుడి ముప్పు లేదని సమాచారం. ఒకవేళ సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఉన్నపళంగా వర్షం పడితే.. ఏ జట్టు ఫైనల్ వెళుతుందని చాలా మందిలో చిన్న అనుమానం ఉంది. వారికోసమే ఈ క్లారిఫికేషన్. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం‍.. టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు రిజ్వర్‌ డే ఉంది. ఒకవేళ సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం‍ కలిగించి ఒక్క బంతి కూడా పడకున్నా.. రిజర్వ్‌ డేలో మొత్తం మ్యాచును కొనసాగిస్తారు. షెడ్యూల్ రోజు సగం మ్యాచ్‌ జరిగినా.. మిగతా మ్యాచును రిజర్వ్‌ డేలో కొనసాగిస్తారు. 

సెమీస్ మ్యాచ్‌లు వరణుడి కారణంగా రిజర్వ్‌ డేలో కూడా సాధ్యపడకపోతే.. సూపర్ 12 దశలో టేబుల్‌ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్‌ రద్దైతే న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ రద్దైతే భారత్‌ ఫైనల్‌కు చేరతాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌ రిజర్వ్‌ డేలో కూడా సాధ్యపడకపోతే.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. వర్షం కారణంగా సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగకుంటే.. న్యూజిలాండ్‌, భారత్ విజేతగా నిలుస్తాయి. 

Also Read: సూర్యకుమార్‌ షాట్స్ చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం.. సెమీస్‌లో అడ్డుకుంటాం: స్టోక్స్  

Also Read: ఆ ప్లేయర్ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేయలేదు.. సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News