IND Vs AUS: తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మార్క్ కెప్టెన్సీ.. ఈ మార్పు చూశారా..?
India vs Australia 1st T20 Updates: విశాఖ వేదికగా ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఇలా..
India vs Australia 1st T20 Updates: వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమితో టీమిండియా ఫ్యాన్స్ తీవ్రనిరాశలో ఉన్నారు. ఫైనల్ వరకు అజేయంగా చేరిన భారత్‌ను కంగారూలు అలవోకగా ఓడించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ ఓటమి బాధ నుంచి తెరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండగా.. ఫైనల్‌ల్లో కంగారూలతోనే టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ నేతృత్వంలోని యువ భారత్ రంగంలోకి దిగింది. విశాఖ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్.. తుది జట్టు ఎంపికలో తన మార్క్ చూపించాడు. పిచ్‌ను ముందే అంచనా వేసుకున్న సూర్యకుమార్.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ మాథ్యూ వేడ్ నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగింది.
"ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ బాగా కనిపిస్తోంది. మంచు తర్వాత పిచ్ మెరుగుపడుతుంది. ఇది కొంచెం కష్టం. కానీ చివరిలో ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది. ఈ సిరీస్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మా ప్లేయర్లు అందరూ ఫ్రాంచైజీలు, దేశీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు. తమను తాము నిరూపించుకునేందుకు మంచి అవకాశం. వాషింగ్టన్, శివమ్ ధుబే, అవేష్ ఖాన్ బెంచ్‌పై కూర్చున్నారు." అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
"టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసే వాళ్లం. తరువాత మంచు రావచ్చు. యువ ఆటగాళ్లకు భారత్‌లో ఆడేందుకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. తరువాత టీ20 వరల్డ్ కప్‌కు కేవలం 10-12 మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయి. మేము ఆ ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తున్నాము. కొంతమంది వన్డే ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. మాక్స్‌వెల్, జంపా, హెడ్ ప్రస్తుతం ఆడడం లేదు.." అని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆసీస్: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, తన్వీర్ సంఘా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook