IND Vs AUS 3rd ODI Updates: టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లలో భారీ మార్పులు.. మ్యాచ్‌కు ముందు షాక్..!
Australia Won The Toss Elected to Bat First Against India: చివరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు భారీ టార్గెట్ విధించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్11లో భారీ మార్పులు జరిగాయి. పూర్తి వివరాలు ఇలా..
Australia Won The Toss Elected to Bat First Against India: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. ఇప్పటికే భారత్ సిరీస్ సొంతం చేసుకోవడం ఈ మ్యాచ్ నామమాత్రమైనా.. ప్రపంచకప్‌కు ముందు చివరి మ్యాచ్ కావడంతో రెండు జట్లు గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్నాయి. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టీమిండియాను వైరల్ ఫీవర్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే ఫీవర్ కారణంగా కొందరు ఆటగాళ్లు దూరమవ్వగా.. మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ జ్వరం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా.. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్11 లోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా కూడా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షిస్తోంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ.. "మేము బ్యాటింగ్ చేయబోతున్నాం. మంచి వికెట్‌గా కనిపిస్తోంది. 100 ఓవర్లలో అది ఎలా మారుతుందో కచ్చితంగా తెలియదు. ప్రపంచ కప్‌కు ఓటమితో వెళ్లడం ఇష్టం లేదు. ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు. గెలుపు బాటపట్టేందుకు ఇది మంచి రోజు. ఇక్కడ విభిన్న పరిస్థితులు ఉన్నా.. గతంలో మేము ఇక్కడ చాలా ఆడాము కాబట్టి ఇబ్బంది లేదు. తుది జట్టులో ఐదు మార్పులు చేశాం. స్టార్క్, మాక్స్‌వెల్ తిరిగి వచ్చారు. తన్వీర్ సంఘా అరంగేట్రం చేస్తున్నాడు." అని తెలిపాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "ఇక్కడ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. మంచి వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. మేము ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాము. శారీరక దృక్పథం కంటే మానసికంగా ధృడంగా ఉండేందుకు విరామాలు చాలా ముఖ్యమైనవి. గత రెండు మ్యాచ్‌లలో మా జట్టు ఆడిన తీరుతో చాలా సంతోషంగా ఉంది. దాదాపు మేము చేయాలనుకున్న ప్రతిదాన్ని పూర్తి చేశాం. మనం ఏమి చేయాలనుకుంటున్నామో చూసేందుకు మాకు అవకాశం ఇస్తుంది. మేము ఎలాగైనా ఛేజ్ చేయాలని అనుకుంటున్నాం. రెండు కొత్త బంతులను ఉపయోగించగలమో లేదో చూద్దాం. నేను, విరాట్, కుల్దీప్ అందరూ తిరిగి వచ్చారు. ఈ మ్యాచ్‌కు అశ్విన్ కూడా దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ టీమ్‌లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బాగాలేదు. అతనికి వైరల్ ఫీవర్ వచ్చింది. కాబట్టి అతను ఈ మ్యాచ్‌కు తప్పుకున్నాడు." అని చెప్పాడు.
తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్.
Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి