Curators preparing normal track in Ahmedabad for India vs Australia 4th Test says GCA: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్‌ ఇండోర్‌ వేదికగా జరిగింది. స్పిన్‌కు బాగా సహకరించిన ఈ పిచ్‌పై బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో రోజు మొదటి సెషన్ ప్రారంభం అయిన కాసేపటికే మ్యాచ్ ముగిసింది. బ్యాటింగ్‌ కష్టంగా మారిన ఇండోర్‌ పిచ్‌పై ఐసీసీ సీరియస్‌ అయింది. మూడో టెస్టుకు ఉపయోగించిన పిచ్‌ అత్యంత చెత్తదని, ఇండోర్ మైదానానికి మూడు డీమెరిట్‌ పాయింట్లు కేటాయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో టెస్టు మ్యాచ్‌ ఓడిపోవడంతో భారత్  పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023కు దూసుకెళ్లడంపై సందిగ్ధత ఏర్పడింది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కనీసం డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఓడితే మాత్రం శ్రీలంక జట్టు విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో చివరి టెస్ట్ అటు ఆస్ట్రేలియా, ఇటు టీమిండియాకు కీలకంగా మారింది. 


ఇండోర్ పిచ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. గుజరాత్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (జీసీఏ) అప్రత్తమమైంది. ఎలాంటి రిమార్క్‌ లేకుండా  అహ్మదాబాద్ పిచ్‌ను తయారు చేసేందుకు సిద్దమైంది. పిచ్ తయారీ విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి ఎలాంటి సూచనలు రాలేదని జీసీఏ తెలిపింది. 'పిచ్ విషయంలో భారత క్రికెట్‌ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మాకు ఎలాంటి సూచనలు రాలేదు. ఎప్పుడు తయారు చేసినట్లుగానే మా క్యురేటర్లు సిద్ధం చేస్తారు. జనవరిలో రంజీ మ్యాచ్‌ జరిగింది. రైల్వేస్ 500కి పైగా పరుగులు.. గుజరాత్‌ 205, 247 పరుగులు చేసింది. గత కొన్ని రోజులుగా బీసీసీఐ గ్రౌండ్స్‌, పిచ్‌ల కమిటీ ప్రతి క్యురేటర్‌కు మార్గదర్శకత్వం చేసింది. తప్పకుండా మంచి టెస్టు మ్యాచ్‌ పిచ్‌ను తయారు చేస్తాం' అని జీసీఏ అధికారులు తెలిపారు. 


Also Read: టయోటా ఫార్చ్యూనర్‌కు బదులుగా.. జనాలు ఈ చౌకైన ఎస్‌యూవీని కొంటున్నారు! రూ 20 లక్షలు ఆదా  


Also Read: Tata Safari EV 2023: టాటా సఫారి ఎలక్ట్రిక్ వెర్షన్ టెస్టింగ్ ప్రారంభం.. త్వరలోనే మార్కెట్‌లోకి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.