IND vs AUS 4th Test Score Updates: టీమిండియా రన్ మెషిన్, కింగ్ కోహ్లీ అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరింది. మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయిన విరాట్ కోహ్లీ.. నాలుగో టెస్టులో శతకం బాదాడు. కెరీర్‌లో 28వ టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకంతో అత్యధిక టెస్టు సెంచరీల పరంగా హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌లను సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఇది 75వ సెంచరీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది ఆసియా కప్‌లో కోహ్లీ తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఆ తరువాత డిసెంబర్ నెలలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వన్డే ఫార్మాట్‌లో శతకం చేశాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో మూడేళ్ల తర్వాత 100 పరుగుల మార్క్‌ను దాటాడు. కోహ్లీ బ్యాట్‌ నుంచి 2019 నవంబర్ 22న అతను బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. దాదాపు 40 ఇన్నింగ్స్‌ల తరువాత కీలక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ మరో ఘనత కూడా సాధించాడు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత సొంతగడ్డపై 4 వేల టెస్ట్ పరుగులు పూర్తి చేసిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా 25 వేల అంతర్జాతీయ పరుగులను కూడా పూర్తి చేశాడు. ఇంటర్నెషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది కోహ్లీకి ఇది మూడో సెంచరీ. 


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. నాలుగో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఆసీస్ కంటే ఇంకా ఐదు పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (138), అక్షర్ పటేల్ (38) క్రీజ్‌లో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. రోహిత్ శర్మ 35, పుజారా 42, రవీంద్ర జడేజా 28, కేఎస్ భరత్ 44 పరుగులతో రాణించారు. మూడో సెషన్‌లో టీమిండియా వేగంగా బ్యాటింగ్ చేసి.. సాధ్యమైంత త్వరగా ఆసీస్‌ను బ్యాటింగ్‌ అప్పగించాలి.


Also Read: India Vs Australia: అహ్మదాబాద్ టెస్టులో భారత్ జోరు.. ఆసీస్‌కు దీటుగా..  


Also Read: MLC Kavitha: ఊహగానాలకు చెక్.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook