Nitish Pushpa Swag: ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్ నితీష్‌పై ప్రశంసలు తొలి టెస్ట్ సెంచరీ
Nitish Pushpa Swag: నితీష్ అంటే ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్. ఇది చెప్పింది ఎవరో కాదు..సాక్షాత్తూ బీసీసీఐ. ఆసీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి టీమ్ ఇండియాను గట్టెక్కించిన విశాఖ కుర్రోడు, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాకు నిదర్శనమిది.
Nitish Pushpa Swag: కంగారూల గడ్డపై జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియాకు ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి. టెస్ట్ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదు చేసి టీమ్ ఇండియా భారీ స్కోర్‌కు కారణమయ్యాడు, బీసీసీఐ ప్రశంసలు అందుకుంటున్నాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలవుట్ అయింది. ఆ తరువాత రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు గట్టి దెబ్బే తగిలింది. టాప్ ఆర్డర్ అంతా తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. ఒక్క యశస్వి జైశ్వాల్ ఒక్కడే 82 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 3 పరగులు, కేఎల్ రాహుల్ 24 పరుగులు, విరాట్ కోహ్లీ 36 పరుగులు చేస్తే ఆకాశ్ దీప్ డకౌట్ అయ్యాడు. రిషభ్ పంత్ 28 పరుగులు, రవీంద్ర జడేజా 17 పరుగులకు అవుట్ అవడంతో 164 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఫాలో ఆన్ ప్రమాదం ఏర్పడింది. ఈ దశలో బరిలో దిగిన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి విజృంభించి ఆడాడు. వాషింగ్టన్ సుందర్ సహాయంతో చెలరేగి ఆడి టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 105 పగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మూడో రోజు ఆట ముగిసేసరికి టీమ్ ఇండియా 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల చేసింది. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే 116 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో ఆన్ గండం నుంచి టీమ్ ఇండియాను గట్టెక్కించడమే కాకుండా తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసిన నితీష్‌పై బీసీసీఐ ప్రశంసలు కురిపిస్తోంది. నితీష్ అంటే ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్ అంటూ ట్వీట్ చేయడం విశేషం
అటు నితీష్ కూడా ఆట మధ్యలో తగ్గేదే లే అంటూ బ్యాట్‌తో స్వాగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాలుగు టెస్ట్ ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియాలు చెరో విజయం సాధించగా ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది.
Also read: AP Government: సంపద కోసం బాండ్లు అమ్మేస్తున్న ఏపీ ప్రభుత్వం, మరో 5 వేల కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.