India Bowl Australia ALL Out For 199: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్లు కంగారెత్తారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఆరంభించిన కంగారూలు.. 49.3 ఓవర్లలో 199 పరుగులకే కుప్పకూలారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌ త్రయాన్ని ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జోరుకు కళ్లెం వేశాడు. 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో కేవలం 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేయగా.. డేవిడ్ వార్నర్ 41 రన్స్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలవడంతో మరో ఆలోచన లేకుండా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలోనే బుమ్రా షాకిచ్చాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్‌ను డకౌట్‌కు చేసి.. భారత్‌కు శుభారంభం అందించాడు. మార్ష్‌ క్యాచ్‌ను స్లిప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఆ తరువాత వార్నర్, స్మిత్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో కాస్త కోలుకున్నట్లే కనిపించింది. అయితే వార్నర్‌ను కుల్దీప్ ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు.


మార్నెల్ లబూషేన్‌తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 36 పరుగులు జోడించారు. అయితే స్మిత్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో మలుపు తిరిగింది. లబూషేన్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (15), అలెక్స్ కారీ (0), కెమెరూన్ గ్రీన్ (8), కెప్టెన్ పాట్ కమిన్స్ (15) వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. చివర్లో మిచెల్ స్టార్క్ 35 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి జట్టు స్కోరును 200 రన్స్‌కు చేరువ చేశాడు. చివరికి 49.3 ఓవర్లలో 199 పరుగుల ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. హార్థిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. 


200 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. లక్ష్యం స్వల్పంగానే ఉన్నా.. భారత బ్యాట్స్‌మెన్లు నిర్లక్ష్యంగా ఆడకూడదు. పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా సహకరిస్తుండడంతో ఆచితూచి లక్ష్యం వైపు అడుగులు వేయాల్సి ఉంది.


Also Read: Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!  


Also Read: Crucial Monday: చంద్రబాబు కేసుల్లో రేపు సోమవారం అత్యంత కీలకం, ఏం జరగనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి