India vs Australia Playing 11 and Toss Updates: సొంత గడ్డపై వరల్డ్ కప్‌ వేటను ప్రారంభించింది టీమిండియా. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. డెంగ్యూ బాధపడుతున్న గిల్ పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లోకి రావడంతో సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఆసీస్‌కు గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. స్టోయినిస్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాము మొదట బ్యాటింగ్ చేస్తామని తెలిపాడు. మంచి వికెట్ లాగా కనిపిస్తోంది.. బ్యాటింగ్ చేయడానికి మంచి వాతావరణం కనిపిస్తోందని చెప్పాడు. ప్రస్తుతం మంచి పొజిషన్‌లో ఉన్నామని.. ఆటగాళ్లకు తగినంత సమయం దొరికిందన్నాడు. ట్రావిస్ హెడ్ అడిలైడ్‌లో ఇంకా కోలుకోలేదు. అబాట్, స్టోయినిస్, ఇంగ్లిస్ ఈ మ్యాచ్‌కు దూరరమయ్యారని తెలిపాడు. 


"బౌలర్లకు ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. ఆట సాగుతున్న కొద్దీ బంతి మలుపు తిరుగుతుంది. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ముఖ్యం. లైన్ సెట్ చేసుకుని బంతులు వేయాల్సి ఉంటుంది. మేము అంతకు ముందు ఇక్కడ చాలా మ్యచ్‌లు ఆడాము. వార్మప్ గేమ్‌లకు ముందు మేము రెండు మంచి సిరీస్‌లు ఆడాం. దురదృష్టవశాత్తు శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌ సమయానికి కోలుకోలేదు. మేము ఈ రోజు ఉదయం వరకు వేచి చూశాం. అతను కోలుకోలేకపోయాడు. గిల్ స్థానంలో ఇషాన్ వచ్చాడు. అతను ఓపెనింగ్ చేస్తాడు.." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..


ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా.


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


Also Read: Shubman Gill: తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడా..? రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే..!  


Also Read: Crucial Monday: చంద్రబాబు కేసుల్లో రేపు సోమవారం అత్యంత కీలకం, ఏం జరగనుంది


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి