Steve Smith To Lead Australia Team: వరుస రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఆసీస్ బ్రేక్ వేసింది. మూడో టెస్టులో విజయం సాధించడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్లోకి కూడా దూసుకెళ్లింది. ఇండోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఇరు జట్లు మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ శిబిరానికి బ్యాడ్‌న్యూస్ వచ్చింది. చివరి టెస్టు కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి రావడం లేదు. కమిన్స్ తన తల్లి చికిత్స కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండడం లేదు. కమిన్స్ గైర్హాజరీతో జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి స్టీవ్ స్మిత్ చేపట్టనున్నాడు. మూడో టెస్టులో స్మిత్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 


ఢిల్లీ టెస్ట్ ఓటమి తర్వాత కమిన్స్ ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తన తల్లి చాలా అనారోగ్యంతో ఉన్నారని.. అందువల్ల ఇండోర్ టెస్ట్‌లో భాగం కాలేనని కమ్మిన్స్ ముందు చెప్పాడు. తరువాత అహ్మదాబాద్ టెస్టుకు కమిన్స్ తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అహ్మదాబాద్ టెస్టుకు కూడా ఈ స్టార్ పేసర్ దూరమవ్వడంతో స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 


బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి 2 టెస్టు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయిన ఆసీస్.. మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. సరైన సమయంలో బౌలింగ్‌లో మార్పులు చేసి స్టీవ్ స్మిత్ ఫలితాన్ని రాబట్టాడు. గత టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్మిత్ (499 పరుగులు).. ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 24.25 సగటుతో కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన చివరి టెస్టులో స్మిత్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఆసీస్ అభిమానులు. 


Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..  


Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook