India Vs Australia WTC Final 2023 Updates: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంకా 280 రన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (44), అజింక్యా రహానే (20) నాటౌట్‌గా ఉన్నారు. అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా బరిలోకి దిగింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ (60 బంతుల్లో 43, 7 ఫోర్లు, ఒక సిక్స్‌) దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్‌ గిల్ (18), ఛెతేశ్వర్‌ పుజారా (27) విఫలం అయ్యారు. కంగారూ‌ బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, నాథన్‌ లైయన్‌ చెరో వికెట్ పడగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి రోజు ఆటలో ఏం జరుగుతోందనని ఆసక్తికరంగా మారింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభం అందించారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ.. పరుగులు రాబట్టారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. అయితే 19 బంతుల్లోనే 18 పరుగులు చేసిన గిల్‌ను బొలాండ్ ఔట్ చేశాడు. కెమెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో డైవ్ చేస్తూ క్యాచ్‌ అందుకోగా.. రీప్లైలో బంతిని నేలను తాకినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో నెట్టింట విమర్శలు వస్తున్నాయి. 


అనంతరం వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్ పుజారాతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత నాథన్ లైయన్ దెబ్బ తీశాడు. 43 పరుగులు చేసి రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూ రూపంల ఔట్ చేశాడు. తరువాతి ఓవర్‌లోనే కమిన్స్ బౌలింగ్‌లో  పుజారా కూడా ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 93 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడగా.. విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 71 పరుగులు జోడించారు.


ఐదో రోజు వీరిద్దరు ఎంత సేపు క్రీజ్‌లో టీమిండియా అంత సేఫ్‌ జోన్‌లోకి వెళుతుంది. ఓవైపు గెలుపు ఊరిస్తున్నా.. ఓటమి కూడా భయపెడుతోంది. కోహ్లీ, రహానే ఔట్ అయితే జట్టును ఆదుకునే నమ్మకమైన బ్యాట్స్‌మెన్ లేడు. కేఎస్ భరత్, రవీంద్ర జడేజా ఆసీస్ బౌలర్లను కాచుకుని నిలబడితే.. మ్యాచ్‌లో గెలవకున్నా.. డ్రాతో అయినా గట్టేక్కొచ్చు. 


Also Read: Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ క్లియర్‌గా నాటౌట్.. అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..?  


అంతకు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో నాలుగో రోజు ఆరంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు నిలువరించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తగ్గిపోయింది. చివర్లో వికెట్ కీపర్ అలెక్స్ కారీ (66), మిచెల్ స్టార్క్ (41) జట్టును ఆదుకున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా మూడు, షమీ, ఉమేశ్ యాదవ్ చెరో రెండు వికెట్లు, సిరాజ్ తలో వికెట్ తీశారు.


Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook