Virat Kohli-Ajinkya Rahane: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచేందుకు టీమిండియా చేరువలో ఉంది. అదే సమయంలో ఓటమి కూడా భయపెడుతోంది. భారత బ్యాట్స్‌మెన్ ఐదో రోజు ఆటలో కంగారూ బౌలర్లను దీటుగా ఎదుర్కొవాలి. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 270/8 వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. టీమిండియా ముందు 444 రన్స్ టార్గెట్‌ను విధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత లక్ష్యాన్ని ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఛేదించలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 3 వికెట్లు కోల్పోయి.. 164 పరుగులు చేసింది. టీమిండియా టెస్ట్ ఛాంపియన్‌గా నిలవాలంటై 280 రన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (44), అజింక్యా రహానే (20) ఉన్నారు. ఆశలన్నీ వీరిద్దరిపైనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ, అజింక్య రహానే నాలుగో వికెట్‌కు అజేయంగా 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు 85 శాతం విజయ అవకాశాలు ఉండగా.. భారత్‌కు 15 శాతమే ఉంది. ప్రస్తుతం 60 బంతుల్లోనే 44 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.. మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు రహానే 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 


ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఆసీస్‌ బౌలర్లను కాచుకుని నాలుగో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ముగించారు. ఆదివారం కోహ్లీ, రహానే క్రీజ్‌లో నిలబడితినే విజయ అవకాశాలు లేదంటే డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే.. రెండోసారి కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.  


444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు అంపైర్ తప్పుడు నిర్ణయం కూడా దెబ్బ తీసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 7 ఓవర్లలోనే 41 పరుగులు జోడించి.. గట్టి పునాది వేసే క్రమంలో షాక్ తగిలింది. 19 బంతుల్లోనే 18 పరుగులు చేసిన గిల్‌ను బొలాండ్ పెవిలియన్‌కు పంపించాడు. కెమెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో డైవ్ చేస్తూ క్యాచ్‌ పట్టగా.. రీప్లైలో బంతిని నేలను తాకినట్లు కనిపించింది. గిల్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌ క్రీజ్‌లో ఉంటే.. టీమిండియా పటిష్ట స్థితిలో ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ (43), పుజారా (27) పరుగులు చేశారు.


Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  


Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్‌ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook