Ind Vs Ban: టీమిండియాలో కీలక మార్పు.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్‌కు పిలుపు
IND vs BAN 3rd Odi Match: బంగ్లాదేశ్‌తో రెండు వన్డేలు కోల్పోయిన భారత్.. అన్ని వైపులా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి వన్డేకు కూడా ఓడిపోతే.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి కీలక ఆటగాడిని తీసుకువచ్చింది.
IND vs BAN 3rd Odi Match: చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు ఉంది టీమిండియా మేనేజ్‌మెంట్ పరిస్థితి. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన తరువాత జట్టులోకి మరో ఆటగాడిని తీసుకువచ్చింది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో ఓడిపోయిన భారత్.. రెండో వన్డేలో ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండు వన్డేల్లో టీమిండియా ఓటమికి పోస్ట్‌మార్టం నిర్వహించిన మేనేజ్‌మెంట్.. ఓ స్పిన్నర్ లోటు ఉన్నట్లు గుర్తించింది. జట్టులో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లు ఉన్నా.. నాణ్యమైన స్పిన్నర్ లేనిలోటు కొట్టోచ్చినట్లు కనిపించింది. దీంతో మూడో వన్డే కోసం కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది.
బంగ్లాదేశ్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌కు ఈ చైనామన్ స్పిన్నర్‌కు బీసీసీఐ కబురు పంపించింది. మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ గాయాల కారణంగా దూరమైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా తరఫున కుల్దీప్ యాదవ్ తన చివరి వన్డే ఆడాడు. ఆఖరి మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్ చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. హిట్‌మ్యాన్ రోహిత్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ త్రిపాఠి లేదా రజత్ పటిదార్‌లలో ఒకరు జట్టులోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కెప్టెన్ రాహుల్ రిస్క్ చేస్తాడా.. లేదంటే ఇషాన్ కిషాన్‌కు ఓపెనింగ్‌లో చోటు కల్పిస్తాడా లేదా అని చూడాలి. శనివారం రెండు జట్ల మధ్య ఆఖరి వన్డే జరగనుంది.
టీమిండియా జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
Also Read: CM KCR: హైదరాబాద్ చుట్టూ మెట్రో రైల్.. సీఎం కేసీఆర్ మరో గుడ్ న్యూస్
Also Read: Ap Rains: ఏపీలో భారీ వర్షాలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook