Cyclone Mandous Effect In Ap: మాండూస్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న మాండూస్.. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, జిల్లాల్లో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ యాజమాన్యాలను హెచ్చరించారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాల యంత్రాంగాలకు సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
సహాయక చర్యల కోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని దాదాపు కోటి మందికి సబ్‌స్రైబర్లకి హెచ్చరికలు పంపించినట్లు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు సూళ్లూరుపేట నియోజకవర్గం తడకుప్పం వద్ద సముద్ర తీరప్రాంతంలో నివాసం ఉంటున్న జాలర్ల కుటుంబాలను అధికారులు తరలిస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. తుఫాన్ ప్రభావంతో గురవారం రాత్రి నుంచి ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. సూళ్లూరుపేట, బీఎన్ కండ్రిగ, తడ, వీ.పాలెం, సత్యవేడు మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Budget 2023: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..?
Also Read: Pawan Kalyan: వారాహి కలర్ వివాదంపై పవన్ కళ్యాణ్ పంచ్.. జనసేనానిని ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి